Breaking News

యూరియా కోసం యాతన

Published on Tue, 09/16/2025 - 05:44

సాక్షి, నెట్‌వర్క్‌: యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుసేవా కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. ఘర్షణలు, తోపులాటలు చోటుచేసుకోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు. అయినా కూటమి సర్కారు పట్టంచుకోవడం లేదు. పైగా కూటమి నేతలు, వారి అనుయాయులకు యూరియా బస్తాలను అడ్డదారిలో అందిస్తోంది. ఫలితంగా అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆందోళనకర ఘటనలు ప్రభుత్వ కఠినత్వానికి, తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.  

⇒ విజయనగరం జిల్లా గజపతినగరం మండలం లోగీశ గ్రామ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు సోమవారం బారులు తీరారు. క్యూలో ఉన్నవారికి కాకుండా టీడీపీ అనుచరులకు అడ్డదారిలో యూరియా పంపిణీ చేయడంతో రైతులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఓ రైతు కిందపడిపోయాడు. దీంతో కర్షకులు ఆందోళన చేయడంతో అధికారులు యూరియా పంపిణీని నిలిపివేశారు.    

⇒ శ్రీకాకుళం జిల్లా సంత»ొమ్మాళి మండలం హెచ్‌ఎన్‌ పేట, వడ్డితాండ్ర సచివాలయ పరిధిలోని రైతులు యూరియా కోసం సోమవారం బారులు తీరారు. ఎండలోనే గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. సగం మందికే యూరియా బస్తాలు అందాయి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత మండలం కోటబొమ్మాళిలోనూ రైతులు యూరియా కోసం గ్రోమోర్‌ సెంటర్‌ వద్ద పడిగాపులు పడ్డారు.  

⇒ చిత్తూరు జిల్లా బంగారుపాళెంలోని గ్రోమోర్‌     కేంద్రం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం పడిగాపులు పడ్డారు. బస్తాలు తీసుకునే క్రమంలో గందరగోళం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేశారు.   

⇒ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక, తోటపల్లి రైతు భరోసా కేంద్రాల వద్ద యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. చెప్పులు క్యూలైన్లో ఉంచి మండుటెండలో పడిగాపులు పడ్డారు.   సాయంత్రం సమయంలో వర్షం పడటంతో తోటపల్లిలో వానలోనే తడిసిముద్దయ్యారు.  

⇒ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం నాగాపురం సచివాలయం వద్ద రైతులు యూరి యా కోసం సోమవారం ఆందోళన చేశారు. కేవలం 40 బస్తాలు పంపిణీ చేసి ఆపేయడంతో మిగతా రైతులు సిబ్బందిని నిలదీశారు. 

⇒ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గరిశింగిలో సోమవారం అరకొరగా యూరియా అందుబాటులోకి రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు. క్యూలైన్‌లో నిరీక్షించినా యూరియా దొరక్క రైతులు నిరాశతో వెనుదిరిగారు.    

⇒ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలోని రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం తహసీల్దార్‌ కార్యాయలం వద్ద ధర్నా చేపట్టారు. టోకెన్ల జారీలోనూ అధికారులు చేతివాటం చూపుతున్నారని దుయ్యబట్టారు. విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారిణి గీతాకుమారి, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)