నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు
Breaking News
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
పట్టించుకోరా?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
Published on Thu, 04/17/2025 - 18:43
సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రైతులు నిలదీశారు. గురువారం.. పునాదిపాడులో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. రైస్ మిల్లును, కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని మంత్రిని రైతులు నిలదీశారు. కోత కోసి రెండు రోజులైనా ఎవరూ పట్టించుకోవడం లేదన్న రైతులు.. గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.

డ్యామేజ్ అయిన (చిల్లులుపడిన) గన్నీ బ్యాగులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతు ఈనిందా దొడ్లో కట్టేశామా అనేలా అధికారుల తీరు ఉందంటూ రైతులు మండిపడ్డారు. దళారులు, అధికారులు, మిల్లర్లతో కుమ్మక్కైపోయారని రైతులు ఆరోపించారు. బాలాజీ మిల్లు చెబితేనే ధాన్యం కొంటున్నారంటూ రైతులు ఆరోపించారు. రైతుల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పలేకపోయారు.
#
Tags : 1