Breaking News

6ఏ నోటీసులపై భగ్గుమన్న రైతులు

Published on Sun, 07/27/2025 - 06:01

నక్కపల్లి: రైతుల ఆమోదం లేకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం బల్‌్కడ్రగ్‌ పార్కుకు అదనపు భూ సేకరణ చేపట్టడంపై రైతులు మండిపడుతున్నా­రు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో జానకయ్యపేట, సీహెచ్‌ఎల్‌పురం గ్రామాల పరిధి­లో బల్క్‌ డ్రగ్‌ పార్కు కోసం అదనంగా 197 ఎకరాల భూమిని సేకరించడానికి మేలో ప్రభుత్వం 6ఏ నోటీసు ప్రకటన విడుదలచేసి అభ్యంతరాలు తెలపాలని పేర్కొంది. అయితే, భూములిచ్చేది లేదం­టూ రైతులు పలుమార్లు నిరసన తెలిపినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంపై వారంతా రగిలిపోతున్నారు.

ఈ నేపథ్యంలో.. శనివారం వైఎస్సార్‌సీపీ, సీపీఎంల మద్దతుతో రైతులు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఇప్పటికే ప్రభుత్వం రెండు వేల ఎకరాలను బల్క్‌డ్రగ్‌ పార్కు కోసం కేటాయిస్తే మరో 700 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడం దుర్మార్గమన్నారు. ఇందులో 197 ఎకరాలు జానకయ్యపేట, సీహెచ్‌ఎల్‌పురం రెవెన్యూ పరిధిలో తీసుకోవడానికి పత్రికా ప్రకటన విడుదల చేశారన్నారు.  ఈ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ.. రైతులను బెదిరించి భూము­లు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.జ

జిల్లాలో ఎక్కడాలేని విధంగా హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న నక్కపల్లి మండలంలోనే వేల ఎకరాల భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఎకరా, రెండెకరాల భూములు కలిగిన రైతులు కంపెనీలకు భూములిచ్చేస్తే వాటిపై వచ్చే తక్కువ పరిహారంతో ఎలా బతుకుతారని వారు ప్రశ్నించారు. రైతులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. వచ్చేనెల 6న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను సైతం అడ్డుకుని నిరసన తెలియజేస్తామని వారు స్పష్టంచేశారు. పలువురు టీడీపీ నేతలు కూడా భూములు ఇవ్వబోమంటూ తహశీల్దార్‌కు  లిఖితపూర్వకంగా తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)