17న విజయవాడలో రైతుల మహా ధర్నా

Published on Mon, 01/13/2025 - 06:04

సాక్షి, అమరావతి :  రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ­లు అమలు చేయడంలో ఘోరంగా విఫ­లమైన టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లా­లలో దాదాపు 80కు పైగా మండలాలు కరువు కో­రల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండ­లాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుందే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. 2023–­24లో ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌లలో వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన 3.91 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు విడుదల చేయలేదు.

ఖరీఫ్‌–­2023 సీజన్‌లో రైతుల తరఫున రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు చెల్లించకపోవడం వల్ల రైతు­ల­కు న్యాయంగా దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందలేదు. ఇలా రైతుల­కు చెల్లించాల్సిన రూ.12,563 కోట్లు ఎగ్గొట్టింది. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో భారీ ధర్నా నిర్వహణకు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కే ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పు­డు అమలు చేస్తారంటూ ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతు­న్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమి­టో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా.. అన్నది స్పష్టం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యల సాధనకు డిమాండ్‌ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద మహా ధర్నా నిర్వహించబోతున్నామని వారు స్పష్టం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)