మా భూములు వదిలేయండి సారూ..!

Published on Wed, 12/24/2025 - 05:34

శాంతిపురం: ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయానికి భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేని రైతుల భూముల్లోని నిర్మాణాల వివరాల నమోదు­కు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యా­యి. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని దండికుప్పం వద్దకు మంగళవారం అధికారులు వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున రైతులు అక్కడికి చేరుకున్నారు. అధికారులతో వాదనకు దిగారు. రైతులకు నచ్చజెప్పేందుకు రాళ్లబూదుగూరు ఎస్సై నరేష్, తహసీల్దార్‌ ప్రకాష్ బాబు, డీటీ శివకుమార్‌ చర్చలు జరిపారు. 

తమ భూ­ములు ఇచ్చేందుకు సుమఖంగా లేమని, హైకోర్టు­ను ఆశ్రయించినట్టు 44 మంది రైతులు తెలిపారు. కోర్టు ఉత్తర్వు, తమ అంగీకారం లేకుండా భూముల్లోకి రావద్దని తేల్చి చెప్పారు. పాతికేళ్ల క్రితం టైడిల్‌ సిల్క్‌ పరిశ్రమ కోసం అమ్మవారిపేట, కిలాకిపోడు రెవెన్యూలలో లాక్కున్న భూ­ములు, ఇతర పరిశ్రమల కోసం ఆరేళ్ల క్రితం విజలాపురం, అమ్మవారిపేట రెవెన్యూలలో తీసుకు­న్న భూములు కూడా వృథాగానే ఉన్నాయన్నారు. రైతుల నుంచి తీసుకున్న భూములు ఐదేళ్లలో అభివృద్ధి చేయకపోతే భూ సేకరణ చట్టం ప్రకారం తిరిగి వారికే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

భూముల్లోని నిర్మాణాల వివరాలను నమోదు చేసుకోవడానికి మాత్రమే వచ్చామని, సహకరించాలని అధికారులు కోరినా రైతులు ససేమిరా అన్నారు. కోర్టు వ్యాజ్యంలోని ఆస్తుల్లో ఎవరూ ప్రవేశించరాదని రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసిన బోర్డులను అధికారులకు చూపించారు. ఇప్పటికే సేకరించిన రెండు వేలకు పైగా ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించి మిగతా రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చక్రపాణిరెడ్డి అధికారులను కోరా­రు. 

రైతుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ కరుణకుమారికి అధికారులు ఫోన్‌లో వివరించి వెనుదిరిగారు. 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)