Breaking News

మిథున్‌రెడ్డితో ములాఖత్‌.. కన్నీరు పెట్టిన తల్లి స్వర్ణలత

Published on Mon, 07/28/2025 - 12:43

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్‌ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. మిథున్‌ రెడ్డితో ఆయన తల్లి స్వర్ణలత, చెల్లి శక్తి రెడ్డి, బావ అఖిల్, ములాఖత్‌ అయ్యారు. వీరితో పాటుగా వైఎస్సార్‌సీపీ నేతలు కూడా అక్కడికి వెళ్లారు. ఈ సందర్బంగా మిథున్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో, ఆయన తల్లి స్వర్ణలత భావోద్వేగానికి గురయ్యారు. మిథున్ రెడ్డి పరిస్థితిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

అనంతరం, మిథున్‌ రెడ్డి తల్లి స్వర్ణలత మాట్లాడుతూ.. ‘అన్యాయంగా నా కుమారుడిని జైల్లో పెట్టారు. టెర్రరిస్టులను చూసినట్టు చూస్తున్నారు.  కనీస సదుపాయాలు కల్పించలేదు. కాస్త మెరుగైన సదుపాయాలు అందించాలని కోరుతున్నాం’ అని అన్నారు.

మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలను కొనసాగిస్తోంది. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయనకు ఇచ్చిన సదుపాయాలపై ఏనాడు రివ్యూ పిటిషన్ వేయలేదు. ఏసీ సదుపాయం కూడా కల్పించాం. జైలు అధికారులపై ప్రభుత్వ ఒత్తిడి ఎంత ఉందో రివ్యూ పిటిషన్ వేయడం చూస్తే అర్థమవుతుంది. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తున్నారు’ అని తెలిపారు.  

డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ..‘ప్రభుత్వం దారుణమైన విధానాలను అనుసరిస్తోంది. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారు. మిథున్ రెడ్డిని అన్యాయంగా మద్యం కేసులో ఇరికించారు. కచ్చితంగా ప్రజలంతా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారు’ అని వ్యాఖ్యలు చేశారు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌