Breaking News

కాలు బెణికింది అంతే

Published on Wed, 02/07/2024 - 04:46

చిత్తూరు కలెక్టరేట్‌: గత టీడీపీ ప్రభుత్వం క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం చూపింది. క్రీడాకారులు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో నిస్తేజంగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఆడుదాం ఆంధ్రా పేరుతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారీ ఎత్తున క్రీడలను నిర్వహిస్తోంది.

వీటి ద్వారా ఆయా క్రీడల్లో గ్రామీణ ఆణిముత్యాలను వెలికితీస్తోంది. అయితే వీటిపైనా రామోజీరావు తన వక్రబుద్ధిని చాటుకున్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో ఒక కబడ్డీ క్రీడాకారిణి గాయపడితే ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ‘ఈనాడు’లో అసత్య కథనాన్ని అచ్చేశారు. ‘సాయం కావాలా.. వెళ్లి సీఎంను అడగండి’ అనే శీర్షికతో విషం జిమ్మారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఇవి.. 

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డీఆర్‌పురం గ్రామానికి చెందిన మునెమ్మకు కబడ్డీ అంటే ఎంతో ఇష్టం. టీడీపీ పాలనలో క్రీడలకు ప్రోత్సాహం లేకపోవడంతో ఆమె కబడ్డీ పట్ల ఉన్న ఆసక్తిని చంపేసుకుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆడుదాం ఆంధ్రా పోటీలు నిర్వహించడంతో ఎంతో సంతోషపడింది. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. గత నెల 25న నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఆమె ఎడమ కాలు బెణికింది.

ఆ సమయంలో అక్కడున్న వైద్యాధికారులు, అధికారులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే కాలు బెణికిందంతే అని చెప్పి తన భర్తతో కలిసి పుత్తూరుకు వెళ్లి మునెమ్మ కట్టు కట్టించుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎడమకాలు బెణికిన మునెమ్మ వైద్య చికిత్సల నిమిత్తం మంగళవారం అధికారులు రూ.35 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.

ఆర్డీవో చిన్నయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ, కార్వేటినగరం తహసీల్దార్‌ పుష్పవతి, ఎంపీడీవో శ్రీధర్‌లు మునెమ్మ ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తనకు ఎలాంటి సమస్యలేదని, ఆటల్లో గాయాలు సహజమేనని మునెమ్మఅధికారులకు తెలిపారు.

ఆడే సమయంలో ఎడమ కాలు బెణికిందని చెప్పారు. ఆ సమయంలో నొప్పి ఏమీ లేకపోవడంతో తామే పుత్తూరుకు వెళ్లి కట్టు కట్టించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి సమస్య వచ్చినా జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని మునెమ్మకు అధికారులు హామీ ఇచ్చారు. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)