Breaking News

వారం వరకు వడగాడ్పులుండవు

Published on Wed, 04/26/2023 - 05:32

సాక్షి, విశాఖపట్నం: మూడు వారాల నుంచి కొద్దిరోజుల కిందటి వరకు దడపుట్టించిన వడ­గా­డ్పులు తగ్గు­ముఖం పట్టాయి. మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని వాతావరణ­శాఖ ప్రకటించింది. ఈ సమాచారం ప్రజ­లకు ఉపశ­మనం కలి­గిం­చింది. ఇటీవలి వరకు రాష్ట్రంలో అనేక ప్రాం­తాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైనే ఉండటంతో పలుచోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగా­డ్పులు కూడా వీచాయి. నిప్పులు చెరిగే ఎండలకు జనం అల్లాడిపోయారు. 4 రోజుల కిందటి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది.

అల్ప­పీడన ద్రోణి, విండ్‌ డిస్కంటిన్యూటీ (గాలికోత)ల కారణంగా అకాల వర్షాలు మొద­లయ్యాయి. ఉరు­ములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీస్తు­న్నా­యి. దీంతో ఆకాశంలో మబ్బులు కమ్మి ఒకింత చల్లదనాన్ని పంచుతు­న్నాయి. ఈ పరిణామాలతో పగటి ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం వ­ర­కు ఒకిం­త ప్రభా­వం చూపుతున్నా ఆ తర్వాత తగ్గు­ముఖం పడుతూ ఊరట­నిస్తున్నాయి. ప్రస్తుతం పలు­­చోట్ల సాధా­రణంగాను, కొన్నిచోట్ల సాధార­ణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగాను, అక్కడక్కడ 1–2 డిగ్రీలు ఎక్కువ­గాను నమోదవుతున్నాయి. ఫలితంగా నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడా ఎండలు విజృంభించడం లేదు.

వడగాడ్పులు లేవు. ప్రస్తు­తం అల్పపీడన ద్రోణి/గాలులకోత పశ్చిమ విదర్భపై ఉన్న ఉప­రితల ఆవర్తనం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు వ్యాపించి ఉంది. ఇది సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఈదురు­గాలు­లతో వర్షాలు కురుస్తున్నాయి. పగటి ఉష్ణోగ్ర­తలు మునుపటికంటే తక్కువగా నమోదవుతు­న్నాయి. ఈ పరిస్థితులు వారం రోజులపాటు కొన­సా­గు­తా­యని, అందువల్ల అప్పటివరకు వడగా­డ్పులు వీచే అవకాశాల్లేవని భార­త వాతావరణ విభా­గం మంగళవారం తెలిపింది.

మే నెల సమీపిస్తున్న తరుణంలో ఏప్రిల్‌ ఆఖరి వరకు ఇంకెంత ఉష్ణతీవ్రతను భరించాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్న ప్రజలకు ఈ సమా­చారం ఊరటనిచ్చే అంశమని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ సునంద ‘సాక్షి’తో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల మధ్యాహ్నం వేళ వరకు ఒకింత ఉష్ణ తీవ్రత అనిపించినా ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లబడుతోందని చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)