Breaking News

Fact Check: సీతకొండపై బాబు బొంకు!.. అబద్ధాలతో ట్వీట్

Published on Thu, 04/20/2023 - 07:32

సాక్షి, విశాఖపట్నం: నాడు రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలామ్‌కు అవకాశం కల్పించింది తానేనంటూ తరచూ బుకాయించే చంద్రబాబు ఆయన పేరుతో తాజాగా మరోసారి బరి తెగించారు! ఇటీవల విశాఖలో జీ 20 సదస్సు సందర్భంగా బీచ్‌రోడ్డు సీతకొండ సమీపంలోని వ్యూ పాయింట్‌ని సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అయితే కలాం వ్యూ పాయింట్‌ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చేసిందంటూ చంద్రబాబు ట్వీట్‌ చేయడంపై నెటిజన్లు మండిపడు­తున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు మహనీయుడైన కలాం పేరును వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జనసైన్యం పేరుతో జనసేనకు చెందిన ఓ వ్యక్తి బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పోస్ట్‌ చేసిన ట్వీట్‌ను కొద్దిగా మార్చి ఇంగ్లీష్‌లో చంద్రబాబు మధ్యాహ్నం ట్వీట్‌ చేశారు.

ఇక్కడ కూడా కాపీ, పేస్ట్‌లో చంద్రబాబుని మించినవారు లేరంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సీతకొండ ఎదురుగా ఖాళీ స్థలం నుంచి సముద్రం అద్భుతంగా కనిపిస్తుంది. స్థానికులు దశాబ్దాలుగా దీన్ని సీతకొండ వ్యూ పాయింట్‌గానే వ్యవహరిస్తున్నారు. తాము 30 ఏళ్లుగా విశాఖలోనే ఉంటున్నామని, వ్యూ పాయింట్‌ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. 

రూ.3.29 కోట్లతో వ్యూ పాయింట్‌ అభివృద్ధి
సుందర విశాఖ సాగర తీరంలో సరైన వ్యూ పాయింట్స్‌ లేకపోవడంతో జీ 20 సదస్సు సందర్భంగా సీఎం జగన్‌ ఆదేశాల మేరకు జోడుగుళ్ల పాలెం సమీపంలోని ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చారు. చక్కటి పెయింటింగ్స్‌ ఏర్పాటు చేశారు. నడక దారితోపాటు మార్బుల్స్‌తో కూర్చునే బెంచీలు, లవ్‌ వైజాగ్‌ చిహ్నం తదితరాలతో తీర్చిదిద్ది వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌గా నామకరణం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)