Breaking News

పార్టీ ఆఫీస్‌లకు చవకగా ప్రభుత్వ భూములు

Published on Fri, 11/14/2025 - 05:32

సాక్షి, అమరావతి: జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాలకు నియో­జకవర్గ, మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూ­ము­లను చవకగా 99 ఏళ్ల పాటు లీజుకు కేటాయించేలా చంద్రబాబు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయించాలని, పార్టీలు మనుగడలో ఉంటే 99 ఏళ్లకు లీజు పొడిగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇప్పుడు ఆ ఉత్తర్వులకు సవరణలు చేస్తూ ప్రభుత్వ భూముల కేటాయింపు లీజును 66 ఏళ్లకు పెంచుతూ.. పార్టీ మనుగడలో ఉంటే 99 ఏళ్లకు లీజును పొడిగించాలని గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్త­ర్వుల్లో సూచించారు. తాజాగా జారీ చేసిన జీవో ఆధారంగా అధికారంలో ఉన్న పార్టీలు నియో­­జకవర్గాలు, మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి, తమ పార్టీ కార్యాలయాల కోసం 66 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు లీజుకు కేటాయింపులు చేయించుకోనున్నాయి. 

ఇదిలా ఉండగా మచిలీపట్నం నార్త్‌ మండలంలో గతంలో రవాణా శాఖకు కేటాయించిన 1.60 ఎకరాల భూమి కేటాయింపులను రద్దు చేసి, ఇప్పుడు ఆ భూమిని తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఎకరానికి ఏడాదికి రూ.1,000 చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయించారు. ఈ భూమిని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి అప్పగించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

అలాగే తిరుపతి రూరల్‌ మండలం అవిలాలలో టీడీపీ కార్యాలయం కోసం ఖరీదైన రెండు ఎకరాల భూమిని 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేసింది. ఎకరానికి ఏడాదికి రూ.1,000 లీజు చొప్పున కేటాయించారు. ఈ భూమిని తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునికి అప్పగించాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)