ఒత్తిడిని చిత్తు చేస్తే విజయం మీదే!

Published on Sun, 03/10/2024 - 05:54

సరిపడా నిద్రా అవసరమే...
విద్యార్థులు/పోటీ పరీక్షల అభ్యర్థులు ఉన్న సమయాన్ని పాఠ్యాంశాల వారీగా పక్కాగా విభజించుకోవడంలోనే సగం విజయం సిద్ధిస్తుంది. ముఖ్యమైన ఆయా సబ్జెక్టులు, టాపిక్‌ను గుర్తించి, వాటిని ప్రాధాన్య క్రమంలో చదవాలి. ఒంటరిగా కాకుండా కొంత మంది విద్యార్థులు బృందంగా చర్చించుకుంటూ సన్నద్ధం అవ్వడం మేలు. రోజుకు కనీసం 6–7 గంటలు తప్పనిసరిగా పడుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మార్కులు, ర్యాంక్‌ల కోసం పదే పదే వారితో మాట్లాడడం మంచిది కాదు. సబ్జెక్ట్‌ మీద పట్టు సాధించేలా విద్యార్థుల్లో చైతన్యం తీసుకుని రావాలి.  ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి ప్రశాంత వాతావరణం తయారు చేయాలి. – డాక్టర్‌ కె.వి.రావిురెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, విశాఖపట్నం

మొబైల్, స్ట్రీట్‌ ఫుడ్స్‌కు గుడ్‌బై చెప్పాలి
కరోనా అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలోను పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి ఎదుర్కొనే ఘటనలు ఉండేవి. అయితే అప్పట్లో చిట్కాలు, మందులతో సమస్యకు పరిష్కారం లభించేది. కరోనా అనంతరం అకడమిక్‌ కార్యకలాపాల్లోను మొబైల్‌ ఫోన్‌ వినియోగం పెరిగింది. దీంతో పిల్లల్లో సెల్‌ఫోన్‌ వాడకం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితి వల్ల పరీక్షల సమయంలో ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంది. పరీక్షల సమయంలో మొబైల్‌కు దూరంగా ఉండడం మేలు. కొద్దిసేపు సేదతీరడం కోసం పిల్లలకు సెల్‌ఫోన్‌లు ఇస్తుంటారు. అలా చేయద్దు. వాకింగ్, రన్నింగ్, ఇతర క్రీడల వైపు మళ్లించడం వల్ల శారీరక శ్రమ కలిగి, ఆరోగ్యంగా ఉంటారు. ఇక.. స్ట్రీట్‌ ఫుడ్స్‌కు గుడ్‌బై చెప్పాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు కల్పించుకుని, తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని పెట్టాలి. దీని వల్ల త్వరగా నిద్రపోవడానికి వీలుంటుంది. – డాక్టర్‌ వెంకట కిరణ్, అసోసియేట్‌ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్‌

టెలీమెడిసన్‌ కాల్‌ సెంటర్‌
మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు వైద్య శాఖ ఏర్పాటు చేసిన టెలీమెడిసన్‌ కాల్‌ సెంటర్‌ను సంప్రదించి సలహాలు, సూచనలు పొందవచ్చు. 14416/180089114416 నెంబర్‌లకు ఫోన్‌ చేసి కాల్‌ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ సుశిక్షితులైన కౌన్సెలర్‌లు అందుబాటులో ఉంటారు. విద్యార్థులు, ఇతర ప్రజలు మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలు ఉన్న వారు ఉచితంగా కాల్‌సెంటర్‌ సేవలు పొందవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)