Breaking News

‘స్కిల్‌ స్కామ్‌ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది’

Published on Sat, 10/14/2023 - 20:12

సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్‌ స్కామ్‌ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరగాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్‌ స్కాం జరిగిందని జీఎస్టీ డీజీ తేల్చినట్టు ఉండవల్లి చెప్పుకొచ్చారు. 

కాగా, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్‌ స్కామ్‌ కేసును జీఎస్టీ అధికారులు  వెలికితీశారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరగాలి. స్కిల్‌ స్కామ్‌లో ఫైళ్లు మాయం చేశారని చెబుతున్నారు. స్కిల్‌ స్కామ్‌ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. పూణే జీఎస్టీ అధికారుల విచారణలో ఇది బయటపడింది. స్కిల్‌ స్కామ్‌ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారు. 

ఈ ప్రాజెక్ట్‌తో సంబంధంలేదని సీమెన్స్‌ కంపెనీ చెప్పింది. ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని సీమెన్స్‌ తెలిపింది. ఒప్పందంపై సంతకం పెట్టిన వ్యక్తి తమ కంపెనీలో పనిచేయడం లేదని వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీ లేఖ రాసింది. చంద్రబాబు ఎందుకు ఎవరి మీదా చర్యలు తీసుకోలేదు?. బెయిల్‌ ఇవ్వలేదని జడ్జిపై ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారు. ప్రాథమిక సాక్ష్యాధారాలతో రిమాండ్‌కు పంపించారు. సీబీఐ విచారణ చేస్తే ఫైళ్లు ఎలా తగటబడ్డాయో తెలుస్తుంది. టీడీపీలో మంత్రులుగా చేసిన వాళ్లు కూడా చౌకబారుగా విమర్శలు చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ దేశం వదిలి పారిపోయారు. 

బెయిల్‌పై పిటిషన్‌ వేయకుండా కేసు కొట్టేయాలని వాదిస్తున్నారు. స్కిల్‌ స్కామ్‌లో వాస్తవాలు బయటకు రావాలి. ఈ కేసులో సీబీఐ ఎంక్వైరీ అడిగితే తప్పేంటి?. నేను సీబీఐ విచారణ కోరితే టీడీపీకి ఎందుకు కోపం వస్తోంది?. స్కిల్‌ స్కాంలో ఉన్నవి సూటుకేసు కంపెనీలు. చంద్రబాబుకు సౌకర్యాలు కావాలంటే కోర్టు ద్వారా అడగొచ్చు. రాజమండ్రి జైలులో చాలా సౌకర్యాలు ఉన్నాయి. లైబ్రరీ ఉంది.. వాకింగ్‌ చేయవచ్చు. కేసు ఒక పద్దతిలో వెళ్తోంది. స్కిల్‌ స్కామ్‌లో అవినీతి జరిగిందనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబుకు తెలియకుండా స్కామ్‌ జరిగిదంటే ఎవరూ నమ్మరు. చంద్రబాబు తనకు తాను సీఈవో అనుకుంటాడు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)