TDP: అదృష్టంతో ఎమ్మెల్యే అయ్యావ్‌!

Published on Sat, 03/08/2025 - 12:58

శ్రీకాళహస్తి: ‘అదృష్టం వల్లో.. పూర్వజన్మ సుకృతం వల్లో ఎమ్మెల్యే అయ్యావు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. హేయమైన నీ మాట తీరు మార్చుకో’ అంటూ టీడీపీ నాయకుడు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఓటేరు కాలువపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శుక్రవారం తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాటల్లోనే.. ‘ఓటేరు కాలువ భూముల గురించి క్షుణంగా విలేకరుల సమావేశంలో తెలిపాను.

అయినా సుధీర్‌రెడ్డి రైతులు కడుపుకొట్టే విధంగా అసెంబ్లీలో ప్రసంగించడం బాధ కలిగించింది. మాపై సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు ఏదో ఒకటి చెప్పి కలరింగ్‌ ఇచ్చుకుంటున్నావని తెలిసింది. మొత్తం వివరాలతో వెళ్లి నువ్వు చేస్తున్న ఆగడాలను బయటపెడుతా. నీ కుటుంబానికి మూడు తరాలుగా అండగా నిలిచాను. నీకు అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యావు. అహంకార ధోరణితో తొమ్మిది నెలల్లో నువ్వు చేసిన అరాచకాలపై వంద పేజీల నివేదిక సీఎంకు అందజేస్తా. ఓటేరు భూముల విషయంలో రైతుల కడుపు కొట్టేవిధంగా నువ్వు చేస్తున్న దుష్పష్ప్రాన్ని మేము పక్కా ఆధారాలతో నిరూపిస్తాం.

డొనేషన్లు తీసుకుని గెలిచి ఎవరినీ పట్టించుకోవడం లేదు. నీ కుటుంబం పరువు, పేరు చెడగొడుతున్నావు. ఒకసారికే నీకు తోక వచ్చేస్తే నీ కుటుంబం కంటే ముందు 1982లో నేను పార్టీలో చేరాను. 9 నెలల నీ పాలన చూసిన తర్వాత బియ్యపు మధుసూదన్‌రెడ్డి వెయ్యి రెట్లు మేలు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విధంగా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నావు. ఇక ప్రతి వారం పార్టీని, నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నీ బాగోతాలు కడిగేస్తా’. అంటూ విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య, గురుదశరథన్‌, ప్రసాద్‌నాయుడు పాల్గొన్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)