Breaking News

రూ.5 కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్‌

Published on Fri, 10/10/2025 - 05:25

దొరవారిసత్రం: తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని నెలబల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక అధికార టీడీపీ నేతలు చెరబట్టారు. ఎకరం రూ.50 లక్షలు విలువచేసే సుమారు పదెకరాల భూముని చదునుచేసి సాగుకు అనువుగా మార్చుకున్న ఘటన గురు­వారం వెలుగులోకి వచ్చింది. వివరాలివీ..

నెలబల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబ­రు 7లో 71 ఎకరాల భూమిలో బీసీ, ఎస్సీ కాలనీలు, వివిధ ప్రభుత్వ భవనాలు, పాఠ­శాల నిర్మాణాలకు పోనూ రహదారి వెంబడే 20 ఎకరాలకు పైబడి ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డుపక్క భూములు ఎక­రా రూ.50 లక్షల వరకు ధర పలుకు­తున్నాయి. గతంలో ఈ భూముల దురాక్రమ­ణను అప్పటి రెవెన్యూ అధికారులు గుర్తించి పీఓబీ (ప్రొహిబిటెడ్‌ ఆర్డర్‌ బుక్‌)లో నమోదు చేశారు. అయినా ఐదెకరాలు వరకు ఆక్రమణకు గురైంది. 

నాలుగు నెలలు కిందట సూ­ళ్లూరుపేట నియోజ­క­వర్గంలోని మాజీ ప్రజా­­ప్రతినిధి కను­సన్నల్లో స్థానిక అధికార పార్టీ నాయకులు కొందరు సుమారు పదె­కరాల భూమిని ఆక్ర మించేందుకు ప్రయ­త్నం చేశారు. రెవెన్యూ అధికా­రు­లు ఇది గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. 

మళ్లీ అదే మాజీ ప్రజాప్రతి­నిధి సహకారం, సూచనలతో మూడ్రోజుల నుంచి పట్టపగలే పీఓబీ కింద ఉన్న పదెకరాల ప్రభుత్వ భూమిని యంత్రా­ల­తో హద్దులు నిర్ణయించి ట్రాక్టర్లతో దున్ని సాగు­కు అనువుగా మార్చు­కుంటు­న్నారు. ఈ దం­దాలో సూళ్లూరు­పేట నియోజకవర్గం మాజీ ప్రజాప్రతినిధికి కూడా వాటా ఉన్నట్లు ఆరోపణలు వస్తు­న్నాయి. రెవెన్యూ అధికా­రులు తెలిసినా చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)