మోసకారి డీటీకి మంత్రిగారి అండ..

Published on Thu, 10/30/2025 - 07:05

సాక్షి, పుట్టపర్తి: అనంతపురం నగరానికి చెందిన కె.అశోక్‌కుమార్‌ పౌర సరఫరాల విభాగంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తూ.. 2022 నుంచి మెడికల్‌ లీవ్‌లో ఉన్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన ఆయన అమాయకులను మోసగించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయిస్తానని, భూములు రాయిస్తానని ఎంతోమంది రైతులను నమ్మించి రూ.కోట్లలో దండుకున్నారు. ఉద్యోగానికి వెళ్తే డబ్బిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఉంటాయని భావించి డ్యూటీకి వెళ్లకుండానే కాలం గడిపేస్తున్నారు.

అంతటితో ఆగకుండా పెళ్లిళ్ల పేరయ్య అవతారమెత్తారు. అలాంటి అధికారికి పెనుకొండ నియోజకవర్గంలోని ఏదో ఒక మండలంలో పోస్టింగ్‌ ఇవ్వాలని మంత్రి సవిత సిఫారసు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అశోక్‌కుమార్‌ అనంతపురం జిల్లాలోని రొళ్ల, అగళి, పరిగితో పాటు వివిధ మండలాల్లో సీఎస్‌డీటీగా పని చేశారు. 2022 నుంచి మెడికల్‌ లీవ్‌లో ఉన్నారు. తాను పనిచేసిన ప్రాంతాల్లో పలువురికి మాయమాటలు చెప్పి రూ.కోట్లలో దండుకున్నారు.

అనంతపురం గుల్జార్‌పేటకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.2 లక్షలు, కోర్టు రోడ్డుకు చెందిన మరో వ్యక్తి నుంచి రూ.3 లక్షలు, తాడిపత్రిలో రూ.8 లక్షలు, కమ్మవారిపల్లిలో రూ.15 లక్షలు, కుంటిమద్దికి చెందిన వ్యక్తి నుంచి రూ.15 లక్షలు, కర్నూలులో రూ.3.5 లక్షలు, నార్పలలో రూ.5 లక్షలు.. ఇలా సుమారు 27 మంది నుంచి రూ.3 కోట్ల వరకు తీసుకున్నారు. కొందరి నుంచి అప్పుగా తీసుకోగా.. మరికొందరికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయిస్తానని నమ్మబలికి వసూలు చేశారు. పనులు చేయించకపోగా.. డబ్బు కూడా తిరిగివ్వలేదు. బాధితులు డబ్బు అడిగితే రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. తమ ఫోన్‌ నంబర్లు సైతం బ్లాక్‌ లిస్టులో పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి ఇలాకాలో పోస్టింగ్‌ కోసం.. 
రూ.కోట్లు దండుకుని బాధితులను ఇబ్బంది పెడుతున్న సీఎస్‌డీటీ అశోక్‌కుమార్‌ చికిత్స కోసం బెంగళూరు వెళ్లి వచ్చేందుకు అనుకూలంగా ఉంటుందని, అతడికి రొద్దం, సోమందేపల్లి, గోరంట్ల, పరిగి, పెనుకొండ మండలాల్లో ఏదో ఒకచోట పో­స్టింగ్‌ ఇవ్వాలని ఉన్నతాధికారులకు విన్నవించా­రు. అయితే, ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. దీంతో మంత్రి సవితతో సిఫారసు చేయించుకున్నారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)