Breaking News

రొయ్య రైతుల సమాఖ్య ఆవిర్భావం

Published on Wed, 09/13/2023 - 02:44

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రొయ్య రైతుల సమాఖ్య (ఏపీ పీఎఫ్‌ఎఫ్‌) ఆవిర్భవించింది. విజయవాడలో మంగళవారం జరిగిన రాష్ట్ర రొయ్య రైతుల సమావేశంలో జాతీయ రొయ్య రైతుల సమాఖ్యకు అనుబంధంగా దీనిని ఏర్పాటు చేశారు. ఏపీ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) కో–వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురామ్‌ సమక్షంలో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.

సమాఖ్య అధ్యక్షునిగా కె.భాస్కరరాజు (కృష్ణా), ప్రధాన కార్యదర్శిగా జీవీ సుబ్బరాజు (పశ్చిమ గోదావరి),  ఉపాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్వరరావు (కృష్ణా), ఆర్‌.నానిరాజు (అంబేడ్కర్‌ కోనసీమ), ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా డి.గోపీనాథ్‌ (ప్రకాశం), కోశాధి­కారిగా వై.వెంకటానందం (అంబేడ్కర్‌ కోనసీమ), సహాయ కార్య­దర్శులుగా ఇ.ఇమ్మానియేల్‌ (బాపట్ల), యు.రాంబాబు  (పశ్చిమ గోదావరి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సమాఖ్య గౌర­వ అధ్యక్షునిగా అప్సడా వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురామ్, సలహాదారులుగా జాతీయ రొయ్య రైతుల సమాఖ్య అధ్యక్షుడు ఐపీఆర్‌ మోహనరాజు, శ్రీనాథ్‌రెడ్డి, నాగభూషణం, సీహెచ్‌ సూర్యారా­వు, డీవీ లక్ష్మీపతిరాజు వ్యవహరిస్తారు. గతంలో ఎన్నడూలేని విధంగా గడిచిన నాలుగేళ్లుగా ఆక్వా రంగానికి, ఆక్వా రైతులకు అన్ని విధాలుగా  చేయూతనిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ రొయ్య రైతుల సమాఖ్య నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది.

కాగా, రొయ్యల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్రాన్‌ ఫెస్టివల్స్‌కు జిల్లా రొయ్య రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉచితంగా రొయ్యలు సరఫరా చేయాలని నిర్ణయించారు.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)