Breaking News

టీడీపీ నేత దాష్టీకానికి వృద్ధుడు బలి

Published on Tue, 07/21/2026 - 04:52

కణేకల్లు: టీడీపీ నేత దాష్టీకానికి ఓ వృద్ధుడు బలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం... అనంతపురం జిల్లా కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మోకా ఆంజనేయులు (70) ఇంటి కుళాయికి కూడా నీరు సరిగా రావడంలేదు. రెండు నెలల క్రితం ఆంజనేయులు బకాయి పడిన నీటి పన్ను రూ. 2 వేలను టీడీపీ నాయకులు ఆయన పింఛన్‌ డబ్బు నుంచి వసూలు చేశారు. నీటి పన్ను వసూలులో ఆసక్తి చూపిన నేతలు.. తాగునీరు ఎందుకు వదలడంలేదని టీడీపీ నేత మారుతీప్రసాద్, అతని భార్య, మాజీ సర్పంచి లావణ్యను అడిగేందుకు ఆంజనేయులు ఈ నెల 13న వారి ఇంటికి బయల్దేరాడు. మారుతీప్రసాద్‌ ఇంట్లో లేడని తెలియడంతో మధ్యలోనే వెనక్కి వెళ్లిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న మారుతీ­ప్రసాద్‌.. ‘నన్నే ప్రశ్నించాలని నా ఇంటి దాకా వచ్చాడా!’ అంటూ ఊగిపోయాడు. మారుతీ ప్రసాద్, ఆయన భార్య అదే రోజు ఆంజనేయులు కౌలుకు చేస్తున్న పొలం వద్దకెళ్లి చెప్పులతో కొట్టి, కాళ్లతో తంతూ చావబాదారు. కూలీల ముందే అవమానించారు. ఈ అవమానం భరించలేక ఆంజనేయులు ఇంటికొచ్చాక పురుగుల మందు తాగాడు.

కుటుంబ సభ్యులు వెంటనే కణేకల్లు ప్రభుత్వా­స్ప­త్రికి, అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వారం రోజులు మృత్యువుతో పోరాడిన ఆంజనేయులు సోమవారం మధ్యాహ్నం కన్నుమూశాడు. తమ తండ్రిని టీడీపీ నేత మారుతీప్రసాద్, భార్య లావణ్య పొట్టన పెట్టుకున్నారని ఆయన కుమారులు భీమన్న, వన్నూరుస్వామి, కుమార్తెలు లలితమ్మ, అంజినమ్మ, భూలక్ష్మి విలపించారు. ఆంజనేయులు మరణంతో టీడీపీ నేతలు ఆయన కుటుంబసభ్యులతో రాజీకి ప్రయత్నాలు చేశారు. 

ఆంజనేయులది హత్యే: మెట్టు గోవిందరెడ్డి
‘ఆంజనేయులు ఆత్మహత్యను టీడీపీ నాయకుడు మారుతీప్రసాద్, అతని భార్య చేసిన హత్యగానే పరిగణించి వారిపై హత్య కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేయాలి. ఆంజనేయులును కాళ్లతో తన్ని, చెప్పులతో కొట్టి ప్రాణాన్ని బలితీసుకున్నారు.’ అని వైఎస్సార్‌సీపీ రాయదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జి మెట్టు గోవిందరెడ్డి డిమాండ్‌ చేశారు.

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)