Breaking News

అడ్డంగా బుక్కైన ‘ఈనాడు’.. ఫేక్‌ వార్తల్లో పచ్చ మీడియా స్టైలే వేరు!

Published on Wed, 02/22/2023 - 15:37

అడుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా!. సంక్షేమ ప్రభుత్వంపై పడి ఏడుపు రాతలు రాసే ఈనాడు తీరే అంతేనేమో. రామోజీరావు స్వయంగా పర్యవేక్షించే ఈ పత్రికలో.. సీఎం జగన్‌ సర్కార్‌పై తప్పుడు రాతలు, ఫేక్‌ కథనాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. తాజాగా బొక్కబొర్లాపడే రీతిలో మరో అడుగేసింది ఈనాడు. అదీ మరీ సోయిలేని రీతిలో వ్యవహరించడమే ఇక్కడ గమనార్హం!.

ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పచ్చ మీడియా ఎప్పుడూ అసత్య ప్రచారమే చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా పచ్చ మీడియాకు తప్పుడు ప్రచారానికి చెక్‌ పెడుతూ ప్రజలకు నిజలేంటో చెబుతూనే ఉంది. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసి ‘ఈనాడు’ అడ్డంగా దొరికిపోయింది. దీంతో చేసేదేమీ లేక తప్పు ఒప్పుకుని చింతిస్తున్నామంటూ ప్రకటనతో చేతులు కడిగేసుకుంది. కానీ, అది వదిలే మరక కాదని సంగ్రహించలేకపోయింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. 
తప్పులు సహజం కావొచ్చు. కానీ, ఈనాడు చేసిన తప్పిదం చిన్నదైతే కాదు. రెండేళ్ల క్రితం గన్నవరం ఘటనలో జగన్‌ సర్కార్‌పై కూడగలుపుకుని ‘ఈనాడు’, టీడీపీ దుష్ప్రచారం చేశాయి. టీడీపీ నేత పట్టాభిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారంటూ విష ప్రచారం చేశాయి. చంద్రబాబు డైరెక్షన్‌లో.. రామోజీ యాక్షన్‌లో ఈనాడు ఓ పె.. ద్ద కథనం రాసుకొచ్చింది. అయితే, 2021 నాటి ఘటనలోని ఫొటోలనే ఈనాడు తాజాగా ప్రచురించి అభాసుపాలైంది. రెండేళ్ల క్రితం ఫొటోలను ప్రచురించి.. ప్రస్తుతం జరిగిన ఘటనలో పట్టాభిని కొట్టారంటూ కలరింగ్‌ ఇచ్చింది ఈనాడు. ఇక, దొరికిందే సందు అన్నట్టుగా ఈ వార్తలను టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌ కూడా ట్వీట్‌ చేయడం గమనార్హం. 

టీడీపీ.. ఈనాడు తప్పుడు ఫొటో కథనాలను ట్వీట్‌ చేసి సీఎం జగన్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. ఇదే అదునుగా పట్టాభిని కొట్టారంటూ కోర్టులో ఈనాడు ఫొటోలను ఆయన న్యాయమూర్తులు కోర్టులో చూపించారు. అనంతరం, వైద్యులు.. పట్టాభికి ఎలాంటి గాయాలు లేవని పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని ధృవీకరించారు. అయితే, వైద్యుల ధృవీకరణతో ఈనాడు అసలు బండారం బయటపడింది. ప్చ్‌.. చేసేదేమీ లేకపోవడంతో చింతిస్తున్నామంటూ ఈనాడు బహిరంగంగానే ఓ నోట్‌ను విడుదల చేసింది. ఈ ఫొటోలు 2021 నాటివి అని ఒప్పుకుంది. టోటల్‌గా  చంద్రబాబు దుష్ట రాజకీయంతో పత్రికా విలువలను పక్కనపెట్టి.. పరువు పొగొట్టుకుంది.

Videos

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)