సీఎం జగన్‌తోనే విద్యాభివృద్ధి 

Published on Sun, 07/30/2023 - 03:47


పటమట(విజయవాడతూర్పు): సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాభివృద్ధికి కంకణం కట్టుకుని పేద విద్యార్థుల భవిష్యత్‌ కోసం అహరి్నశలు శ్రమిస్తున్నారని పలువురు వక్తలు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ–1998 వారికి ఉద్యోగాలు, వేలాదిమంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు నాడు–నేడు, అమ్మఒడి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యాభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యోధుడిలా కృషి చేస్తున్నారన్నారు.

ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామచంద్రరెడ్డి, చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మరింత మేలు కలిగేందుకు ఉపాధ్యాయులందరూ సీఎం వైఎస్‌ జగన్‌కు అండగా నిలవాలని కోరారు. టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రణాళికను రూపొందిస్తున్నారని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీలను ఉపాధ్యాయులు సన్మానించారు. వైఎస్సార్‌ టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. వైఎస్సార్‌ టీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి గడ్డెల సుదీర్, గౌరవ అధ్యక్షుడు జాలిరెడ్డి, వ్యవస్థాపకులు ఓబులాపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)