Breaking News

ఎట్టకేలకు డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల

Published on Sun, 04/20/2025 - 04:00

సాక్షి, అమరావతి: దాదాపు 11 నెలలుగా మెగా డీఎస్సీ అంటూ అభ్యర్థులను ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం శనివారం రాత్రి ఎట్టకేలకు డీఎస్సీ–2025 షెడ్యూల్‌ విడుదల చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డీఎస్సీ పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు గతేడాది డిసెంబర్‌ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

ఎట్టకేలకు అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 16,347 పోస్టుల కోసం షెడ్యూల్‌ వెలువరించింది. ఇందులో ఎస్‌జీటీ 6,599, స్కూల్‌ అసిస్టెంట్‌ 7,487,  పీఈటీ 2 పోస్టులు ఉన్నాయి. దీంతోపాటు ఏపీఆర్‌ఎస్, ఏపీఎంఎస్, సాంఘిక, బీసీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌కు సంబంధించి మరో 2,259 స్టేట్‌/జోనల్‌ పోస్టులు ఉన్నాయి. 

పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్‌ తదితర వివరాలను ఆదివారం ఉదయం 10 గంటల నుంచి విద్యా శాఖ వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. వివరాలకు https:// cse. ap. gov.in / https// apdsc. apcfss. in వెబ్‌సైట్‌లను చూడవచ్చు. 

షెడ్యూల్‌ ఇదీ
దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు: నేటినుంచి మే 15వ తేదీ వరకూ
మాక్‌ టెస్ట్‌: మే 20 నుంచి
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: మే 30 నుంచి
పరీక్షలు: జూన్‌ 6 నుంచి జూలై 6 వరకు
ప్రాథమిక కీ విడుదల: ప్రతి పరీక్ష పూర్తయిన రెండవ రోజున
అభ్యంతరాల స్వీకరణ: ప్రాథమిక కీ విడుదలైన 7 రోజుల వరకు 
ఫైనల్‌ కీ: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారు
మెరిట్‌ జాబితా: ఫైనల్‌ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారు 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)