Breaking News

డీఎస్సీ–2025 మెరిట్‌ లిస్టుల విడుదల

Published on Sat, 08/23/2025 - 02:35

సాక్షి, అమరావతి :  రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ–2025 మెరిట్‌ జాబితాలను శుక్రవారం అర్ధరాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర, జోన్, జిల్లా స్థాయిలో అన్ని సబ్జెక్టుల వారీగా మెరిట్‌ లిస్టులను ప్రకటించింది. వీటిని డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ (http;//apdrc.apcfrr.in/లోనూ, సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంచామని డీఎస్సీ–2025 కన్వినర్‌ ఎంవీ కృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీ పోస్టులకు సంబంధించి జోన్‌ ఆఫ్‌ కన్సిడరేషన్‌లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత డీఎస్సీ లాగిన్‌ ఐడీల ద్వారా కాల్‌ లెటర్లు అందిస్తామన్నారు. 

అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌ ద్వారా కాల్‌ లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో సూచనలను అనుసరించాలని ఆయన పేర్కొన్నారు. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించిన మూడుసెట్ల జిరాక్స్‌ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. అంతకుముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, టైముకి సర్టిఫికెట్ల పరిశీలనకు వ్యక్తిగతంగా హాజరుకావాలి. హాజరుకాని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దుచేస్తారు. 

మెరిట్‌ లిస్టులో తదుపరి ఉన్న అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలకులు పిలుస్తారు. ఇక సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చినంత మాత్రాన అభ్యర్థులు ఎంపిక అయినట్లు కాదని డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్, అర్హత, సంబంధిత నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని స్పష్టంచేశారు. ఇక రాష్ట్రస్థాయి పోస్టులైన ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు రాష్ట్రస్థాయి, జోనల్‌ స్థాయిలో ర్యాంకులను ప్రకటించగా.. స్కూల్‌ అసిస్టెంట్, ఎస్‌జీటీలకు ఉమ్మడి జిల్లాల వారీగా ర్యాంకులు, స్కోర్‌ను విడుదల చేశారు.  

పీజీటీ రాష్ట్ర టాపర్లు వీరే.. 
ఇంగ్లిష్‌ : వారణాశి లక్ష్మీ స్వరూప (87 స్కోరు) 
హిందీ : రమేష్‌ రామనుకొలను (93.5 స్కోరు) 
సంస్కృతం: తునికిపాటి భాను (94 స్కోరు) 
తెలుగు: పట్నాన ధర్మారావు (85.5 స్కోరు ) 
బయాలజీ (ఇంగ్లిష్‌ మీడియం): చోడవరం శివకుమార్‌ (81.5 స్కోరు) 
గణితం (ఇంగ్లిష్‌ మీడియం): సంకరణం విజయ్‌ (78.5 స్కోరు) 
ఫిజిక్స్‌ (ఇంగ్లిష్‌ మీడియం): బాలకిశోర్‌ కురాకుల (74.5 స్కోరు) 
సోషల్‌ స్టడీస్‌ (ఇంగ్లిష్‌ మీడియం): నిరోషా కురమాన (85 స్కోరు) 
ప్రిన్సిపాల్‌: చింతల గౌతమ్‌ (75.5 స్కోరు) 

పీఈటీ రాష్ట్ర ర్యాంకర్లు.. 
అన్నెపు జగదీశ్వరరావు: 90.5 స్కోరు 
టీజీటీ ఇంగ్లిష్.. 
వెలగల రమ్యశ్రీ : 85.43 స్కోరు 
టీజీటీ హిందీ.. 
గొల్లపల్లి పవన్‌ నారాయణ్‌ కౌశిక్‌ శాస్త్రి: 88.53 స్కోరు 
టీజీటీ సంస్కృతం.. 
తునికిపాటి భాను: 93.60 స్కోరు 
టీజీటీ తెలుగు.. 
కల్లె మహేశ్‌బాబు: 85.20 స్కోరు 
టీజీటీ మ్యాథ్స్‌.. 
సుంకరణం విజయ్‌: 87.33 స్కోరు 
టీజీటీ సైన్స్‌.. 
బోకం అనిత: 77.89 స్కోరు 
టీజీటీ సోషల్‌ స్టడీస్‌.. 
బొమ్మిడి డిల్లేశ్‌: 84.20  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)