టీటీడీ విజి­లె­న్స్‌ వైఫల్యం.. తిరుమలలో మరో అపచారం.. వీడియో

Published on Mon, 06/09/2025 - 07:05

తిరుపతి: తిరుమలలోని అలిపిరి చెక్‌ పాయింట్‌కు సమీపంలోని ఏటీఎం సెంటర్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం తాగుతున్న వీడి­యో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం తాగిన వ్యక్తులు ఖాళీ సీసాను అలిపిరి మెట్ల మార్గంలో వేయడం శ్రీవారి భక్తులు ఆగ్రహానికి కారణమైంది.

అయితే, అలిపిరి తనిఖీ కేంద్రానికి కూతవేటు దూరంలో అలిపిరి నడక మార్గం ప్రారంభం అవుతుంది. ఈ ప్రాంతంలో దాదాపు 50కి పైగా సీసీ కెమెరాల ద్వారా టీటీడీ నిఘా ఉంచింది. అలిపిరి మెట్ల మార్గం ప్రారంభ ద్వారం వద్ద లగేజీ కౌంటర్‌కు అభిముఖంగా ఏటీఎం సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతా­ల్లో అండర్‌ పాస్‌ ద్వారా అలిపిరి మెట్ల మార్గం ప్రార­ంభమవుతుంది. భక్తులు ఈ అండర్‌ పాస్‌ ద్వా­రా­కాలినడక ప్రారంభిస్తారు. ఏటీ­ఎంకు ఆనుకుని కొంత ఖాళీస్థలం ఉండటంతో మందు­బాబులు రెచ్చిపోతు­న్నారు.

టీటీడీ విజిలెన్స్‌ నిఘా వైఫల్యమే ఇందుకు కారణమని భక్తులు ఆగ్ర­హం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజి­లె­న్స్‌ నిద్ర మత్తు­లో తూలుతోందనే విషయం ఇటీవల వరుస ఘట­నలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటి ఘట­నలు ఎన్ని జరిగిన ‘మాకేం అవుతుందిలే’ అనే నిర్లక్ష్య ధోరణి వి­జిలెన్స్‌ నిఘా విభాగం సిబ్బందిలో పెరిగిపోయింది. సిబ్బంది పనితీరును నిరంతరా­య­ంగా పర్య­వేక్షించా­ల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవ­హ­రించడంతో వరుస నిఘా వైఫ­ల్యాలు వెలు­గు చూస్తున్నాయి. పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి ఘ­ట­న­లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకో­వా­లని డిమాండ్‌ చేస్తున్నారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)