Breaking News

ఈవీఎంలపై అనుమానాలు నివృత్తి చేయాలి

Published on Fri, 02/27/2026 - 02:44

మహారాణిపేట: ఎన్నికల కమిషన్‌ చొరవ తీసుకొని ఈవీఎంల విషయంలో రాజకీయ పార్టీలు, ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు డిమాండ్‌ చేశారు. ‘ఈవీఎంలు–ఎన్నికల ఫలితాలు’ అనే అంశంపై గురువారం విశాఖలోని ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో బెటర్‌ ఏపీ, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ సంయుక్తంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించాయి. వివిధ రాజకీయ పార్టీలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

గతంలో ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చని స్వయంగా చంద్రబాబు చెప్పారని అన్నారు. చంద్రబాబు దగ్గర ఐటీ సలహాదారుగా పనిచేసిన వేమూరి కృష్ణప్రసాద్‌ బహిరంగంగా ఈవీఎంలను హ్యాక్‌ చేయడమే కాకుండా వాటిని ఎలా హ్యాక్‌ చేయవచ్చనే అంశంపై ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారని గుర్తు చేశారు. వీటిని సునాయాసంగా హ్యాక్‌ చేయవచ్చని అపరకుబేరుడు, అమెరికాకు చెందిన టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ కూడా స్పష్టం చేశారన్నారు. 

ఈవీఎంలపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, భారత్‌లో కూడా ఇటువంటి అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం మౌనం వీడి, సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 

కార్యక్రమంలో ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజు, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్‌ డాక్టర్‌ శీతల్, బెటర్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ జి.త్యాగరాజన్, ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్‌ జేటీ రామారావు, వైఎస్సార్‌సీపీ నాయకులు పల్లా దుర్గారావు, మార్కండేయులు, కమ్యూనిస్టు నేత సూర్యనారాయణ, కాంగ్రెస్‌ నేత కస్తూరి వెంకటరావు, రైల్వే యూనియన్‌ నాయకుడు కె.రామచంద్రమూర్తి, పటా్నయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)