Breaking News

ఉపాధికి ‘హాని’!

Published on Mon, 07/29/2024 - 04:48

సాక్షి, అమరావతి:  కరోనా విపత్తు వేళ 2020–21లో గ్రామాల్లో కొత్తగా ఉపాధి హామీ జాబ్‌ కార్డుల జారీతో పాటు పనుల కల్పనలోనూ మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచింది. మహమ్మారి విరుచుకుపడ్డ వేళ దిక్కు తోచక పట్టణాలకు పట్టణాలే గ్రామాలకు తరలి వచ్చినా నిశ్చింతగా జీవనోపాధి లభించింది! విపత్తులోనూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ  మందగించకుండా పనులు కల్పిస్తూ, పథకాన్ని సద్వి నియోగం చేసుకుంటూ గత ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఇక వ్యవసాయ పనులు ఉండని వేసవి సీజన్‌లో పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించి ఆదుకోవటంలో గత ఐదేళ్లూ ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలోనే కొనసాగింది. ఏటా ఉపాధి పొందిన కుటుంబాలు, లబ్ధి చేకూర్చిన మొత్తం పెరగడమే ఇందుకు నిదర్శనం. 

నిరుపేదల కడుపు నింపిన ఉపాధిహామీలో ఇప్పుడు రాజకీయాలు చొరబడ్డాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో పెత్తనం కోసం టీడీపీ నేతలు రాజకీయ రంగు పులమడంతో పేదల ‘ఉపాధి’కి గండి పడింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మర్నాడే అత్యధిక గ్రామాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిసెంట్లను తప్పించాలని అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. దీంతో మండల అ«ధికారులు వారితో పనులు చేయించలేక గ్రామాల్లో మొత్తం ఉపాధి పనులనే నిలిపివేశారు. 

అధికారిక గణాంకాలే దీనికి సాక్ష్యం. టీడీపీ నేతల నిర్వాకాలతో రాష్ట్రంలో సగానికి పైగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు నిలిచిపోయాయి. మరోవైపు డబ్బులు వసూలు చేసుకుంటూ తమకు నచ్చిన వారిని ఫీల్డ్‌ అసిస్టెంట్లగా నియమించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉపాధి హామీ పనుల తాజా వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్‌ పోర్టల్‌లో నమోదవుతాయి. 

రాష్ట్రవ్యాప్తంగా 13,387 గ్రామ పంచాయతీలు ఉండగా అధికారిక గణాంకాల ప్రకారమే 6,788 పంచాయతీల్లో ఈనెల 26వతేదీకి ముందు వారం రోజుల పాటు కనీసం ఒక్కరికి కూడా పనులు కల్పించకపోవడం గమనార్హం. ఈనెల 26వ తేదీన మాత్రం కేవలం 4,565 గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఉపాధి హామీ పథకం పనులు కొనసాగినట్లు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి. అంటే రాష్ట్రంలో మూడింట రెండొంతుల గ్రామాల్లో పేదలకు ఉపాధి పనులే లేకుండా పోయాయి.   



సహాయకులు.. నిస్సహాయంగా 
గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కోరే వారి వివరాలు నమోదు చేసుకోవడం, ఆయా చోట్ల ముందుగా అనుమతించిన పనులను కూలీలకు కేటాయించడం, పనులు చేసిన వారి వివరాలను మండల కంప్యూటర్‌ సెంటర్‌లో అందజేయడం ఫీల్డ్‌  అసిస్టెంట్ల ప్రధాన విధి. సాధారణంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒకరు చొప్పున ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉంటారు. ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయి (ఎఫ్‌టీఈ) విధానంలో ఫీల్డ్‌ అసిసెంట్లకు రూ.10 వేలకు పైబడి, మిగిలిన వారికి రూ.7,500 నుంచి రూ.10 వేల మధ్య నెల వారీ వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. వీరంతా ప్రస్తుతం గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల అధిపత్య ఆరాటంతో నిస్సహాయంగా మారారు.  

పొలం పనులు లేక.. ఉపాధి దొరకక 
ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని సమయంలో పేదలు వలస వెళ్లకుండా ఉపాధి పనులు కల్పించి ఆదుకోవడం. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఇంకా జోరందుకోలేదు. వర్షాలు కురుస్తున్నప్పటికీ జలాశయాల్లో నీటి నిల్వలు అతి తక్కువగా ఉన్న నేపథ్యంలో పొలం పనులు అత్యధిక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ప్రత్యేకించి ఉపాధి హామీ పనులకు ఎక్కువ డిమాండ్‌ ఉండే రాయలసీమతో పాటు ప్రకాశం, పల్నాడు తదితర జిల్లాల్లో వ్యవసాయ పనులు మందకొడిగా జరుగుతుండటంతో నిరుపేదలు ఉపాధి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు.  

వలస వెళ్లాల్సి వస్తుందేమో.. 
గ్రామంలో నేను, నా భార్య, ఇద్దరు కుమారులు ఉపాధి పనులు చేసుకునేవాళ్లం. కొద్ది రోజులుగా ఉపాధి పనులు బంద్‌ చేశారు. వర్షాలు సరిగా పడక పోవడంతో గ్రామంలో వ్యవసాయ పనులు కూడా దొరకడం లేదు. గ్రామంలో పనులు కల్పిస్తే చేసుకుంటాం. లేకపోతే గ్రామం వదిలి ఇతర పట్టణాలకు పనుల కోసం వలస వెళ్లాల్సి వస్తుంది.   – దావిద్, చిర్తనకల్లు, కోసిగి మండలం, కర్నూలు జిల్లా

పేదల కడుపు కొట్టొద్దు 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చి్చన వెంటనే మా గ్రామంలో ఉపాధి హామీ పథకానికి రాజకీయ గ్రహణం పట్టింది. టీడీపీ నాయకులు ప్రస్తుతం ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను తొలగించాలనే ఉద్దేశంతో గ్రామంలో పనులు ఆపేశారు. పనులు కల్పించాలని కోరు­తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. రాజకీయ ప్రయోజనాలు, ధన ప్రయోజనాల కోసం మాలాంటి పేదల కడుపులు కొట్టడం మంచి కాదు. – నల్లపనేని ప్రసాద్, ఏపినాపి, కలిగిరి మండలం, నెల్లూరు జిల్లా

పనుల్లేక ఇబ్బందులు  
కొద్ది రోజులుగా ఉపాధి పనులు నిలిపేశారు. నేను ప్రతి ఏడాది ఉపాధి పనులకు వెళ్లేవాడిని. ఈ ఏడాది కూడా మొదట్లో పనికి వెళ్లాను. ఇప్పుడు పనులు నిలిపి వేయడం వల్ల అందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉపాధి పనుల వల్ల వచ్చే డబ్బు ద్వారానే జీవనం సాగిస్తున్న మాలాంటోళ్లకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. – సిహెచ్‌.శ్రీరాం, పెదవేమలి గ్రామం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా  

నాలుగు వారాల కూలి రావాలి 
నేను, నా భార్య ఇద్దరం ఉపాధి పనికి వెళ్లేవాళ్లం. జూన్‌ నెల నుంచి పనులు జరగడం లేదు. నాలుగు వారాలకు సంబంధించిన ఉపాధి కూలి డబ్బులు రావాల్సి ఉంది. ఆ డబ్బులు రాకపోవడంతో కష్టంగా ఉంది. అధికారులు స్పందించి ఉపాధి పనులు కల్పిస్తే మా కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.   – షేక్‌.ఇమామ్, కంభం, ప్రకాశం జిల్లా

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)