Breaking News

టీడీపీ నేత కుట్ర... దివ్యాంగుని పింఛను కోత

Published on Fri, 10/04/2024 - 05:54

శ్రీరంగరాజపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పింఛను లబి్ధదారులపై కొరడా ఝుళిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఓ దివ్యాంగుడి పింఛన్‌ను టీడీపీ నాయకుడు రద్దు చేయించారు. దీంతో బాధితుడు గురువారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. శ్రీరంగరాజపురం మండలం, పద్మాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు హేమాద్రి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాధవనాయుడి ఇంటి వద్ద కూలి పనులు చేయడానికి నిరాకరించారు. 

దీంతో కక్ష పెంచుకున్న మాధవనాయుడు అధికారులపై ఒత్తిడి పెంచి హేమాద్రికి వస్తున్న వికలాంగ పింఛను తొలగించడమే కాకుండా దుర్భాషలాడి  కుటుంబం అంతు చూస్తానని బెదిరించాడు. హేమాద్రికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ మొత్తం హేమాద్రికి వచ్చే పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తోంది. 

దీంతో బాధితుడు హేమాద్రి గురువారం శ్రీ రంగరాజపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు యతి్నస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అలాగే, మండలంలోని జీఎంఆర్‌ పురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఢిల్లీకి వస్తున్న వికలాంగ పింఛన్‌ కూడా తొలగించారని, తనకు కూడా పింఛన్‌ను పునరుద్ధరించకపోతే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించారు.  

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)