Breaking News

ఓటీటీ జోరు... డిజిటల్‌ మీడియా హోరు

Published on Wed, 04/30/2025 - 05:35

సాక్షి, అమరావతి: సినిమా చూడాలంటే థియేటర్‌కే వెళ్లాలనే రోజులకు కాలం చెల్లుతోంది. ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌)ల్లో సినిమాలకే ఆదరణ పెరుగుతోంది. వినోదమంటే టీవీ చానళ్లు చూడాలనే రోజులు ఇక గతమే. వినోదం కోసం ప్రజలు డిజిటల్‌ మాధ్యమాలవైపే మొగ్గు చూపుతున్నారు. సినిమాలు, టీవీ చానళ్ల స్థానాన్ని డిజిటల్‌ మీడియా కబళిస్తోంది. ఆధునిక సమాచార సాంకేతిక విప్లవంతో డిజిటల్‌ మీడియా ప్రజల ఇళ్లల్లోకే దూసుకువస్తోంది. 

ఇది స్మార్ట్‌ ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చేస్తోంది. డిజిటల్‌ మీడియా ఏటా సగటున 7 శాతం వృద్ధి సాధిస్తోంది. రానున్న కాలంలో వినోద రంగం అంటే డిజిటల్‌ మీడియాదేనని ‘ఫిక్కీ–ఎర్నెస్ట్‌ యంగ్‌ ఇండియా’ తాజా నివేదిక వెల్లడించింది. వీక్షకుల ఆదరణే కాదు ప్రకటనల ఆదాయంలోనూ డిజిటల్‌ మీడియా ఆధిపత్యం సాధిస్తోందని తెలిపింది. 

టీవీని అధిగమిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ 
దేశంలో టీవీల ద్వారా వినోద కార్యక్రమాల వీక్షణం కంటే స్మార్ట్‌ ఫోన్ల ద్వారానే అధికంగా వినోద కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్, రియాల్టీ షోలు, క్రికెట్, ఇతర స్పోర్ట్స్‌ మొదలైవన్నీ కూడా టీవీల్లో కంటే స్మార్ట్‌ ఫోన్లలోనే వీక్షించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితి మున్ముందు మరింతగా పెరుగుతుంది.

ఓటీటీ  విప్లవం 
సినిమాలను థియేటర్ల కంటే ఓటీటీల్లో చూసేందుకే ఆసక్తి పెరుగుతోంది. 2024లో దేశంలో 1,600 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 500 సినిమాలు కేవలం ఓటీటీల్లోనే విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న కాలంలో ఓటీటీల్లో మాత్రమే విడుదలయ్యే సినిమాల సంఖ్య మరింతగా పెరుగుతుంది. 2027 నాటికి దేశంలో 6.50 కోట్ల ఇళ్లల్లో ఓటీటీ చానళ్లు చూస్తారు. 

ఆదాయంలోనూ డిజిటల్‌ మీడియా జోరు 
వీక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ప్రకటనల ఆదాయంలోనూ డిజిటల్‌ మీడియా ఆధిపత్యం సాధిస్తోంది. టీవీల్లోకంటే డిజిటల్‌ మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు పారిశ్రామిక, వ్యాపార సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. డిజిటల్‌ మీడియా, టీవీలు, షార్ట్‌ వీడియోలు, సోషల్‌ మీడియా మొదలైన వాటిని కలిపి వీడియో వినోద రంగంగా పరిగణిస్తారు. వాటిలో అత్యధిక ప్రకటనల ఆదాయం ఎన్నో దశాబ్దాలుగా టీవీ రంగానికే దక్కేది. 

కానీ.. ఐదేళ్లుగా డిజిటల్‌ మీడియా అనూహ్యంగా దూసుకువస్తోంది. 2019లో దేశంలో మీడియా, వినోద రంగం ప్రకటనల ద్వారా రూ.1.90 లక్షల కోట్లు ఆదాయం సాధించింది. 2024లో అది మరింత పెరిగి రూ.2.50 లక్షల కోట్ల ఆదాయం రాబట్టింది. 2027 నాటికి రూ.3.1 లక్షల కోట్లు రాబడి సాధించవచ్చని అంచనా. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)