Breaking News

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రధానికి ధర్మాన లేఖ

Published on Mon, 01/26/2026 - 14:02

సాక్షి, శ్రీకాకుళం: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రధాని మోదీకి వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి, ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. కేంద్రం తెచ్చిన చట్టాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేశారు’’ అని లేఖలో ధర్మాన పేర్కొన్నారు.

‘‘మీరు తీసుకువచ్చిన గ్రామాల సర్వే, గ్రామ ప్రాంతాల్లో అభివృద్ధి చారిత్రాత్మక నిర్ణయం. 566. 23 కోట్ల రూపాయలతో 3.20 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే విజయవంతంగా పూర్తి చేశారు. జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ, మోడరనైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో మీరు ఉన్నారు. 'భూమి' అనే రాష్ట్ర జాబితాలోని అంశంపై చేసిన కృషి గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది.

భూ రికార్డులను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ తో కలిసి ఈ ముసాయిదా చట్టం తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించింది. పౌరుల మధ్య వివాదరహిత సామరస్యాన్ని పెంపొందించడానికి ఈ చర్యలు మీ ప్రభుత్వం చేపట్టింది. మీరు తెచ్చిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది (AP LAND TITLING ACT 2023 (ACT 27 of 2023)ను 31.10.2023).

2024లోచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా ప్రతిపాదించిన ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు  అమలు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రులతో మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ చట్టం అమలును సమీక్షించాలి’’ అని ధర్మాన ప్రసాదరావు లేఖలో కోరారు.

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)