Breaking News

రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు

Published on Sun, 03/01/2026 - 05:05

సాక్షి, అమరావతి: ‘రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు... మన సహచర పోలీసు అధికారులను వేధించేందుకు మీ తెలివితేటలు ఉపయోగించవద్దు’ డైరెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌ పోలీసు అధికారులకు చేసిన సూచన ఇది. బిహార్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌ అక్రమ అరెస్టుకు ప్రయత్నించిన ఏపీ పోలీసులకు చెంపపెట్టుగా బిహార్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం విదితమే.

బిహార్‌ ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ రిటైర్డ్‌ ఐజీ ఇ. దామోదర్‌ ఐపీఎస్‌ అధికారుల వాట్సాప్‌ గ్రూపులో ఒక పోస్టు పెట్టారు. ఆ గ్రూపులో ప్రస్తుతం సర్వీసులో ఉన్న, రిటైర్‌ అయిన ఐపీఎస్‌ అధికారులు సభ్యులుగా ఉన్నారు. దామోదర్‌ పోస్టుపై డీజీ మాదిరెడ్డి  ప్రతాప్‌ స్పందిస్తూ సర్వీసులో ఉన్న ఐపీఎస్‌ అధికారుల వాట్సాప్‌ గ్రూపులో ఇచ్చిన జవాబు ప్రస్తుతం యావత్‌ పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్‌ ప్రభుత్వ నోటిఫికేషన్‌ న్యాయబద్దం కాదు:  రిటైర్డ్‌ ఐజీ ఇ. దామోదర్‌ 
బిహార్‌ క్యాడర్‌ పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేముందు తమ అనుమతి తప్పనిసరి అని ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ న్యా­యబద్ధమైనది కాదు. ఆ రాష్ట్ర క్యాడర్‌ పోలీసు అధికారి సునీల్‌ నాయక్‌ను రక్షించేందుకే హడావుడిగా ఆ నోటిఫికేషన్‌ జారీ చేశారు. కేంద్ర సా­యుధ బలగాలకు ఉద్దేశించిన నిబంధనను పోలీసు అధికారులకు వర్తింపజేయడం సరైన చర్య కాదు.  

రాజకీయ నేతల చేతిలో పావులు కావద్దు: మాదిరెడ్డి ప్రతాప్‌ 
‘మన తెలివితేటలన్నీ కూడా సహచర పోలీసు అధికారులను వేధించేందుకు ఉపయోగించవద్దు. ఇప్పటికే దేశంలో ఏపీలో మాత్రమే పలువురు పోలీసు అధికారులు జైలుకు వెళ్లారు. విచారణ ఎదుర్కొంటున్నారు. అందుకే రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెడతాం. అంతేగానీ రాజకీయ నేతల ప్రభావానికి గురై ఇటువంటి కక్ష సాధింపు, ప్రతీకార చర్యలకు పాల్పడవద్దు. వాటికి ముగింపు పలుకుదాం’.

మాదిరెడ్డి స్పందన పట్ల హర్షం 
రిటైర్డ్‌ ఐజీ దామోదర్‌ పెట్టిన పోస్టుపై పోలీసు అధికారుల్లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.  పోలీసు అధికారులకు రక్షణ కల్పిస్తూ ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సాటి పోలీసు అధికారి తప్పుబట్టడం ఏమిటని ప్రశ్నించారు. పైగా పోలీసు అధికారుల సంక్షేమం, సమన్వయం కోసం ఉద్దేశించిన వాట్సాప్‌ గ్రూపులలో అందుకు విరుద్ధమైన పోస్టు పెట్టడం పట్ల కూడా పోలీసు అధికారులు అంతర్గత సంభాషణల్లో తప్పుబట్టారు. 

ఈ నేపథ్యంలోనే  డీజీ ర్యాంకు అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌ కాస్త కటువుగానే స్పందించి సరైన సమాధానం ఇచ్చారని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోలీసు శాఖ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఒక్కరైనా  ధైర్యంగా స్పందించి పోలీసు అధికారులు చట్టబద్ధంగా చేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేశారని ప్రశంసిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)