Breaking News

పింఛన్ల పంపిణీ.. పవన్‌ కళ్యాణ్‌కు పరాభవం

Published on Tue, 07/02/2024 - 04:58

పిఠాపురం: వలంటీర్లు లేకపోతే అసలు పింఛన్ల పంపిణీ అసా­ధ్యమన్నారని, కానీ వారి అవసరం లేకుండా పింఛన్లు పంపిణీ చేసి చూపించామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. సోమవారం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలు­వురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచి్చన హామీ ప్రకారం ఒకటో తేదీన వలంటీర్లు లేకుండానే సచివాలయాలు, వివిధ శాఖల సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేస్తున్నారన్నారు.

గతంలో పింఛన్ల పంపిణీలో కొందరు వలంటీర్లు లబ్ధిదారుల వద్ద రూ.100కు తక్కువ కాకుండా తీసుకునేవారని తనకు ఫిర్యా­దులు వచ్చాయన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సిబ్బ­ందితోనే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని అన్నారు. లబ్ధిదారుల వద్ద డబ్బు అడిగేందుకు అవకాశం కూడా ఉండదని, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి బాధ్యత తీసుకుంటారని చెప్పారు. వలంటీర్లు లేకుండానే వ్యవస్థలతో పని చేయిస్తే ఎలా ఉంటుందో దీని ద్వారా చేసి చూపించామన్నారు.

వంద శాతం గ్రామాలకు పూర్తి స్థాయి రక్షి­త మంచినీరు అందించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయా­రు చేయడం, ప్రతి ఇంటికీ లోటు లేకుండా స్వచ్ఛమైన నీరు అందించి, ప్రజలందరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలనేదే తన లక్ష్యమని చెప్పారు. రక్షిత మంచి నీరు, ఉపాధి, సాగునీటి కాలువల పూడికతీత వంటివి చేసి, ప్రజలకు దగ్గర కావాలనేది తన ఆకాంక్ష అన్నారు. రాష్ట్రంలో పంచాయతీ­రాజ్‌ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలనేది తన ప్రయత్నమన్నారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ నుంచి ఎంత కాలు­ష్యం విడుదలవుతోందనే ఆడిట్‌ లెక్కలు తీయిస్తున్నామని చెప్పా­రు. పరిశ్రమల నిర్వాహకులే కాలుష్య నియంత్రణ చర్య­లు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూర­ల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, కలెక్టర్‌ షాన్‌మోహ­న్, ఎస్పీ సతీ­ష్‌­కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ పాల్గొన్నారు.

పవన్‌ కళ్యాణ్‌కు పరాభవం 
భీమవరం: పింఛన్ల పంపిణీ కరపత్రంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చిత్రాన్ని ముద్రించకపోవడం ఆయన్ని పరాభవించడమేనని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సహకారంతో అధికారంలోకి వచి్చన చంద్రబాబు పింఛన్ల కరపత్రంపై కేవలం తన చిత్రాన్ని మాత్రమే ముద్రించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కరపత్రంపై పవన్‌ ఫొటో ముద్రించకుండా దారుణంగా అవమానించారని వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం తాను మాత్రమే ప్రచారం పొందాలన్న యావ చంద్రబాబుకు ఇంకా పోలేదని జనసేన కార్యకర్తలు, నాయకులు విమర్శిస్తున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్‌ పేరుతో పంపిణీ చేస్తున్న పింఛన్ల కరపత్రంపై ఎన్టీఆర్‌ చిత్రాన్ని కూడా వేయకపోవడం గమనార్హం. దీనిపై ఎనీ్టఆర్‌ అభిమానులు కూడా మండిపడుతున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)