Breaking News

హిందువులంతా ఏకం కావాలి

Published on Wed, 09/25/2024 - 05:25

సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా ఏకమై.. కలసికట్టుగా మాట్లాడాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ అన్నారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందువులు మౌనం వహిస్తే, ఆ మౌనం భవిష్యత్తు తరాలను నాశనం చేస్తుందన్నారు. ధర్మాన్ని పరిరక్షించడం గుడికి వెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా, నా ఒక్కడి బాధ్యతేనా అంటూ ప్రశ్నించారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

కనక దుర్గమ్మవారి దర్శనం అనంతరం ఇంద్రకీలాద్రిపై ఆయన మీడి­యాతో మాట్లాడారు. తాను సనాతన ధర్మానికి సంబంధించి పోరాటం చేయాలనుకుంటే తనను ఆపేవారు ఎవరూ లేరన్నారు. ధర్మం కోసం పోరాటం చేస్తే చనిపోవడానికి సిద్ధమని, కానీ, అక్కడిదాకా తీసుకెళ్లనని చెప్పారు. సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ విషయం తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. సనాతన ధర్మానికి, పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడడం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా..? మాట్లాడేవారు ఒకటికి వందసార్లు ఆలోచించి మాట్లాడండి అని చెప్పారు. 

సెక్యులరిజం అనేది వన్‌ వే కాదని అది టూ వే అని చెప్పారు. హిందువులు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మసీదులో చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతారా అని అన్నా­రు. హిందూ దేవుళ్లపైన మాట్లాడేవారు అల్లాహ్‌ పైన, మహ్మద్‌ ప్రవక్తపైన, జీసస్‌పైన మాట్లాడగలరా అంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఇస్లాంపైన మాట్లాడితే ఆ మతం వారు పెద్దఎత్తును బయటకు వస్తారు అంటూ చెప్పారు. హిందువులను రోడ్లపైకి రమ్మని చెప్పడం లేదన్నారు. కనీసం హిందువులకు కోపం రాకపోతే ఏం చేస్తామన్నారు. 

ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ వారికి కూడా విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మంపై ఇష్టానుసారం జోకులు వేయడం, మీమ్స్‌ చేయడం సరికాదన్నారు. ఓ సినిమా ఫంక్షన్‌లో జోకులు వేస్తున్నారని, ఎంతోమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. దేశమంతటికి కలిపి ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ తప్పనిసరి అని చెప్పారు. అంతకుముందు పవన్‌ కళ్యాణ్‌కు ఆలయ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. ఆలయం మెట్లను కడిగి, పసుపు రాశారు.

మహిళలను అడ్డుకున్న సిబ్బంది 
ఆలయంలో మెట్లను పవన్‌కళ్యాణ్‌ శుభ్రం చేసే కార్యక్రమానికి అర్ధగంట ముందు, ఆ తర్వాత కూడా మహిళా భక్తులు మెట్ల పూజ చేసుకోకుండా ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. 

మెట్ల పూజ చేసుకుంటూ వస్తున్న మహిళా భక్తులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని క్యూలైన్‌లోకి పంపేందుకు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి, మహిళా భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. మెట్ల పూజ మొక్కు పూర్తి చేసుకోకుండా దర్శనానికి వెళ్లమని చెప్పడం ఎంత వరకు సబబని మహిళలు మండిపడ్డారు. 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)