Breaking News

50 ఏళ్ల వ్యాపార దుకాణం కూల్చివేత

Published on Wed, 08/28/2024 - 05:18

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ నేతల కక్ష సాధింపు హద్దులు దాటుతోంది. ఇప్పటివరకు గ్రావెల్, మట్టి దందాలతో మునిగితేలిన తెలుగు తమ్ముళ్లు...ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నేతలకు చెందిన ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కనుసన్నల్లో టీడీపీ కార్యకర్తలు చేస్తోన్న దురాగతాలు పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా..వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైన నారాయణ గుప్తాకు చెందిన ఓ దుకాణాన్ని మంగళవారం వేకువజామున నేలమట్టం చేయించారు. 

స్థానిక మునిసిపల్‌ అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వేకువజామున వచ్చి దుకాణాన్ని కూలగొట్టించారు. దుకాణం ఉన్న స్థలం ప్రభుత్వానిది అని అధికారులు చెబుతున్నారు. కావలిలో పారీ్టలకతీతంగా పలువురు నేతలు అధికారుల చర్యను ఖండించారు. పట్టణంలోని రైల్వేరోడ్డులో 1.5 అంకణాల స్థలంలో చిన్న దుకాణం గది 50 ఏళ్లుగా నారాయణ గుప్తా కుటుంబం ఆధీనంలో ఉంది. రెవె­న్యూ అధికారులు జారీ చేసిన పట్టా కలిగి, మునిసిపాలిటీకి పన్ను కూడా చెల్లిస్తున్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నారాయణ గుప్తా కుటుంబానికి చెందిన షాపు గదిని కూలి్చవేస్తామని టీడీపీ నా­య­కులు ప్రచారం చేస్తున్నారు. దీంతో నారాయణ గుప్తా కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కేసు ఉన్నప్పటికీ మునిసిపల్‌ అధికారులు మంగళవా­రం ఉదయాన్నే జేసీబీతో వచ్చి షాపు­ని నేలమట్టం చేశారు. షాపును ధ్వంసం చేసి మెటీరియల్‌ కూడా అప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా తరలించేశారు.

కుటుంబం వీధిన పడేలా చేశారు 
ఎన్నో ఏళ్లుగా మునిసిపాలిటీకి పన్నులు కడుతున్నాం. మా తాతల కాలం నుంచి ఇక్కడే దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాం. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టా ఉంది. ఇటీవల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా పనిచేశానన్న కారణంతో నన్ను టార్గెట్‌ చేశారు. 

కౌంటింగ్‌ తర్వాత మా దుకాణం పడగొడతామని ప్రచారం రావడంతో కోర్టుకు వెళ్లాం. కోర్టులో పెండింగ్‌ ఉన్నప్పటికీ మునిసిపల్‌ అధికారులు మా దుకాణాన్ని పడగొట్టి ఆర్యవైశ్యులకు ద్రోహం చేశారు.  – నారాయణ గుప్తా, వైశ్య నేత 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)