Breaking News

ఏపీలో ప్రజాస్వామ్యమే గెలిచింది

Published on Mon, 09/11/2023 - 06:14

తాడికొండ: చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడిందని,  బహుజనుల ఉసు­రు తగిలి బాబు జైలు పాలయ్యాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హర్షంవ్యక్తం చేశారు. తుళ్లూ­రు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం నాటికి 1,078వ రోజుకు చేరాయి.

రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని పలు­వురు ముఖ్యఅతిథులు సందర్శించి, మాట్లాడా రు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి అలవాటుపడ్డ చంద్రబాబు ప్రభుత్వ ధనం రూ. లక్షల కోట్లు దోపిడీ చేసి  ప్రజలను మోసం చేశాడని చెప్పా­రు. బాబు అవినీతి పాపం పండి పక్కా ఆధారాలతో దొరకడంతో చట్టబద్ధంగా ప్రభుత్వం అరెస్ట్‌ చేయడం హర్షణీయమన్నారు. స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ చేసిన చంద్రబాబుపై గతంలో ఉన్న కేసులను సైతం వెలికి తీసి స్టేలు ఎత్తివేసి పూ­ర్తి విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

బాబు అండ్‌కో అవినీతి బయటపడకుండా చేసేందుకు ఎల్లో మీడియా చేసిన హడావిడి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, పేదలకు ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కోర్టులో అనుమతించి తమకు సహకరించాలని కోరారు.  నాయ­కులు మాదిగని గుర్నాధం, ఈపూరి ఆదాం, పల్లెబాబు, నూతక్కి జోషి, తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)