Breaking News

వక్ఫ్‌ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందే

Published on Sun, 03/30/2025 - 02:34

సాక్షి, అమరావతి: వక్ఫ్‌ సవరణ బిల్లును దేశ ప్రజలంతా అడ్డుకుని తీరాలని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) అధ్యక్షుడు ఖాలిద్‌ సైపుల్లా రెహ్మానీ పిలుపునిచ్చారు. వక్ఫ్‌ సవరణ బిల్లును తిరిస్కరించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ, రాష్ట్ర ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో శనివారం మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముస్లింలు పెద్దఎత్తున తరలిరాగా.. వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ సంఘీభావం తెలి­పాయి. 

ఈ సందర్భంగా జరిగిన సభలో రెహ్మానీ మాట్లాడుతూ.. రాజ్యాంగం ముస్లింలకు ప్రసాదించిన హక్కులను వక్ఫ్‌ సవరణ బిల్లుతో కాలరాసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. వందల ఏళ్లనాటి మసీదులు, మదర్సాల రిజిస్ట్రేషన్‌ పత్రాలు దొరక్కపోతే మత సంబంధమైన బై యూజర్‌ నియమం ద్వారా చట్టబద్ధత లభిస్తుందన్నారు. అటువంటి నియమాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తెచ్చి.. వక్ఫ్‌ ఆస్తు­లను ఆక్రమించుకో­వాలని చూస్తోందని విమర్శించారు. 

దేశంలో ఇప్పటికే లక్షలాది ఎకరాలను ప్రభు­త్వాలు ఆక్రమించాయని, ఇంకా అనేక హాస్యాస్ప­దమైన సవరణలు చేసి వక్ఫ్‌ను బలహీన పరచడా­నికి సవరణ బిల్లు తెచ్చారన్నారు. దీనిపై కొన్ని మీడియా సంస్థలు సైతం తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ వక్ఫ్‌ సవరణ బిల్లు దేశ లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థకు పెను ప్రమాదమని, రాజ్యాంగ పరిరక్షణకు, లౌకిక వాదాన్ని కాపాడేందుకు దేశంలోని సెక్యులర్‌ పార్టీలు ఐక్యంగా పోరాడాలని కోరారు. 

మహా­ధర్నాలో జమాతే ఇస్లాం హింద్‌ (జేఐహెచ్‌) రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ రఫిక్, ఉపాధ్యక్షుడు మాలిక్‌ ముహతషిమ్‌ ఖాన్, మజ్లిస్‌ ఉలమా ఏపీ ప్రతినిధి మౌలానా ముఫ్తి యూసుఫ్,  ఉమ్రి అధ్యక్షుడు మౌలానా నసీర్‌ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వీనర్‌ షేక్‌ మునీర్‌ అహ్మద్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్‌ షేక్‌ అసిఫ్,  మాజీ మంత్రి వడ్డే శోభనా­ద్రీశ్వ­రరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. 

ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం
వక్ఫ్‌ పరిరక్షణ ముస్లింల విశ్వాసానికి సంబంధించిన అంశం. ఈ బిల్లును ఆమోదిస్తే ముస్లిం సమాజానికి తీవ్ర నష్టంతోపాటు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించినట్టు అవుతుంది. వక్ఫ్‌ సవరణ బిల్లును తీసుకొచ్చిన కేంద్రంలో భాగస్వా­మిగా ఉన్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలి­పోతారు. ఈ బిల్లు ముస్లింలకు మాత్రమే నష్టం కలిగించదు. వక్ఫ్‌ చట్టం–1995కు 2013లో సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకుసంక్రమించిన హక్కులు, అ«ధికారాలను కూడా కోల్పోతాయి.  – మౌలానాషా ఫజల్‌ రహీమ్‌ ముజద్దిద్, ప్రధాన కార్యదర్శి, ఏఐఎంపీఎల్‌బీ 

వక్ఫ్‌ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోంది
రాజకీయ ప్రయోజనాల కంటే రాజ్యాంగ పరిరక్షణే ముఖ్యమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భావిస్తారు. అందుకే ముస్లింలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగేలా ఉన్న వక్ఫ్‌ సవరణ బిల్లును మా పార్టీ మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకించారు. 

మరోసారి పార్లమెంట్‌లో ఆ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తుంది. దేశంలో భిన్న మతాలు, కులాలు కలిసి మెలిసి అన్నదమ్ముల్లా మెలగాలన్నదే వైఎస్సార్‌సీపీ ఉద్దేశం. కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు రాజ్యాంగంలో రాసుకున్న రాతలకు తూట్లు పొడుస్తున్నాయి. అటువంటి పాపపు ఆలోచనల నుంచి వచ్చిందే వక్ఫ్‌ సవరణ బిల్లు. 

పాపాలు చేస్తున్న వారితోపాటు.. అలాంటి వారికి అండగా నిలవడం కూడా పాపమే అని ఖురాన్‌ చెబుతోంది. రంజాన్‌ మాసంలో వక్ఫ్‌ సవరణ బిల్లుపై ముస్లిం సమాజం ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణమైన రాజకీయ పార్టీలను ఈ వేదిక ద్వారా నిలదీయాలి.     – పేర్ని నాని, మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నేత 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)