Breaking News

‘ముంతాజ్‌’ అనుమతులు రద్దు చేయాలి

Published on Thu, 02/13/2025 - 05:10

తిరుపతి కల్చరల్‌: అలిపిరికి సమీపంలో టీటీడీకి విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న ముంతాజ్‌ హోటల్‌ అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  ఏపీ సాధు పరిషత్‌ ఆధ్వర్యంలో సాధువులు, మఠ, పీఠాధిపతులు పెద్ద ఎత్తున బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన దీక్ష చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలకు సమీపంలో ముంతాజ్‌ హోటల్‌కు అనుమతి ఇవ్వడం దుర్మార్గమన్నారు. దీనిపై అనేకసార్లు విజ్ఞప్తి చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విడ్డూరమన్నారు. తాము అధికారంలోకి వస్తే తిరుమలను ప్రక్షాళన చేసి ధర్మాన్ని కాపాడతామని నాడు చంద్రబాబు ప్రకటించారని, ఇక డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అయితే వారాహి డిక్లరేషన్, సనాతన ధర్మ రక్షణే లక్ష్యం, సనాతన ధర్మ రక్షణ బోర్డు తెస్తాం అంటూ ప్రగల్భాలు పలికారన్నారు. 

వీరిని నమ్మి తాము ధర్మ రక్షణ కోసం మద్దతు పలికామని చెప్పారు. టూరిజం మంత్రిగా జనసేన పార్టీ నేత ఉండడంతో ముంతాజ్‌ హోటల్‌కు అనుమతుల వెనుక జనసేన హస్తం ఉందని స్పష్టమవుతోందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుని ముంతాజ్‌ హోటల్‌ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే నిరసన దీక్షను ఆమరణదీక్షగా కొనసాగిస్తూ తమ ప్రాణాలైనా ఇవ్వడానికి తాము సిద్ధమని హెచ్చరించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది సాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)