Breaking News

ఇది పత్రికా స్వేచ్ఛపై దాడే

Published on Sat, 10/18/2025 - 05:36

సాక్షి నెట్‌వర్క్‌: ప్రభుత్వ వైఫల్యాలు, నకిలీ మద్యం రాకెట్‌పై వరుస కథనాలు రాస్తుండటాన్ని తట్టుకో­లేక సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి.. వేధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కదం తొక్కారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వ­హించారు. ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. 

వాస్త­వాలు రాస్తున్న ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ ప్ల కార్డులు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు. భావ ప్రకటన హక్కుకు విఘాతం కల్పించవద్దని, ప్రజలంతా రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనిస్తున్నారని.. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. 

సాక్షి హైదరాబాద్‌ కార్యాలయంలో ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిని విచారణ పేరుతో రోజుల తరబడి వేధించడం ఎంత మాత్రం భావ్యం కాదని నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లా.. సాక్షి ఎడిటర్‌పై కేసు సిగ్గు సిగ్గు.. నియంత ప్రభుత్వం సిగ్గు సిగ్గు.. జర్నలిస్టుల గొంతునొక్కే దౌర్జన్య పాలన నశించాలి.. అంటూ నినాదాలు చేశారు. జిల్లాల కలెక్టర్లు, ఉన్న­తా­ధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

భావ ప్రకటన స్వేచ్ఛకు తూట్లు 
రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు భావ ప్రకటన స్వేచ్ఛ­కు తూట్లు పొడుస్తున్నారు. వారి అక్రమాలు వెలుగులోకి తెస్తుంటే సహంచలేని స్థితిలో వ్యవహరిస్తున్నారు. ఇటీవల సాక్షి ఎడిటర్‌ ఇంటికి వెళ్లి తనిఖీలు చేసిన పోలీసులు, ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో హైదరాబాద్‌ కార్యాలయానికి వెళ్లి వేధించడం చాలా దారుణం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా వార్తలో తప్పు ఉంటే ఖండన ఇవ్వాలి. లేదంటే లీగల్‌ నోటీసు ఇవ్వాలి. కానీ, పోలీసు కేసులు నమోదు చేయ­డం ఎక్కడా లేదు. ఇది సరైన విధానం కాదు.– సీహెచ్‌ రమణారెడ్డి, సామ్నా రాష్ట్ర

ప్రధాన కార్యదర్శిబెదిరింపు ధోరణి మానుకోవాలి 
జర్నలిస్టులపై కేసులు పెట్టి, కార్యాలయాలకు పోలీసులు వెళ్లి బెదిరింపులకు పాల్పడే ధోరణి మానుకోవాలి. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగం మనకు కల్పించిన పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. 

రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ బట్టబయలైన నేపథ్యంలో వార్తలు రాస్తే కేసులు పెట్టడం దుర్మార్గ చర్య. సమాజం మేలు కోసమే జర్నలిస్టులు పని చేస్తుంటారు. అలాంటి జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.   – ఎం.రామకృష్ణ, ఇప్టూ రాష్ట్ర కార్యదర్శి

‘సాక్షి’ని వేధించేందుకే తప్పుడు కేసులు
కూటమి ప్రభుత్వం అధి­కా­రంలోకి వచ్చిన వెంటనే సాక్షిని లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యల్లో భాగ­ంగానే తప్పుడు కేసు­లు నమోదు చేస్తోంది. ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ మీద ఒత్తిడి పెంచేందుకు, వాస్తవాలు రాయ­కుండా, ప్రసారం చేయకుండా కట్టడి చేసేందుకు కేసులు బనాయించడం స్పష్టంగా కనిపి­స్తోంది. ఇప్పుడు నకిలీ మద్యం అంశంపై ప్రచు­రి­తమైన కథనాలకు సంబంధించి సోర్స్‌ వెల్ల­డి­ంచాలని ఒత్తిడి చేయడం ఉన్నత న్యాయ­స్థానా­ల తీర్పులకు వ్యతిరేకమే తప్ప మరొకటి కాదు. – వర్దెళ్లి మురళి, సీనియర్‌ సంపాదకులు

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఆపాలి
ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సాక్షి మీడియాపైన రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోంది. ఇది పత్రికా స్వేచ్ఛపైన జరుగుతున్న దాడి. సమాజంలో జరుగుతున్న విష­యాలను మీడియా నిర్భయంగా ప్రజలకు చేరవేస్తుంది. ప్రసారం చేసిన వాటిపై అభ్యంతరముంటే ప్రభుత్వం వివరణ ఇవ్వడమో, ఖండించడమో చేయాలి. అలాకా­కుండా పోలీసులను ఉసిగొల్పి నోటీసులు జారీ చేస్తూ మానసికంగా ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు సరికావు.

ఇలాంటి రాజకీయ కక్షసాధింపు చర్యలను ఏపీ ప్రభు­త్వం వెంటనే ఆపేయాలి. కొంతకాలంగా ప్రభు­త్వాలు మీడి­యాను నియంత్రించాలనే ఆలోచ­న­లతో వ్యవహ­రిస్తు­న్నాయి. ప్రతిపక్షాన్ని నిలువరింపలేక వారికి అండగా ఉన్న మీడి­యాను ఈ విధంగా ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు సరికాదు. మీడియా ఎంత వ్యతిరేక వార్తలు రాస్తే ప్రభుత్వానికి అంత మంచిది. తప్పులు, పొర­పాట్లను సరిచేసుకునే అవకాశం ఉంటుంది.. – ప్రొఫెసర్‌ హరగోపాల్, పౌరహక్కుల నేత 

పత్రికా స్వేచ్ఛపైన దాడి పరాకాష్టకు చేరింది
సాక్షి మీడియాపైన ఏపీ ప్రభుత్వం చేస్తోన్న దాడి పరాకాష్టకు చేరింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధి­కా­రంలోకి వచ్చాక సాక్షి మీడి­యాపైన పదేపదే ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఏదో ఒక అంశాన్ని ఆసరా చేసుకుని దాడులు చేస్తున్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏపీ ప్రభు­త్వా­నికి చీవాట్లు పెట్టినప్పటికీ... వాటిని ఏమా­త్రం ఖాతరు చేయకుండా ఈ విధంగా కక్షసాధింపు­లకు పాల్పడడం ఆక్షేప­ణీయం. 

ఏపీ ప్రభుత్వం, పోలీ­సుల చర్య­ల­ను తీవ్ర­ంగా ఖండి­స్తున్నా. ప్రజా­స్వా­మ్యంలో మీడి­యా పాత్ర అత్య­ంత కీలకమైంది. అలాంటి మీడి­యా హక్కులకు విఘాతం కలిగించడం ఏమాత్రం ఆమోదయో­గ్యం కాదు. – అల్లం నారాయణ, సీనియర్‌ సంపాదకులు, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)