Breaking News

దొంగా పోలీస్‌ ఆటాడించి.. అత్త దారుణ హత్య

Published on Sun, 11/09/2025 - 08:58

విశాఖపట్నం జిల్లా: పెళ్లి నాటినుంచీ పొసగని అత్తను ఒక కోడలు అత్యంత కిరాతకంగా.. అచ్చం హర్రర్‌ క్రైం సినిమా స్టోరీని తలపించే రీతిలో హతమార్చిన ఘటన ఇది. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వేపగుంట సమీపాన అప్పన్నపాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై విశాఖ వెస్ట్‌ జోన్‌ ఏసీపీ పృద్వితేజ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పన్నపాలెంలో వర్షిణి అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో జయంతి సుబ్రహ్మణ్యం, ఆయన భార్య లలితాదేవి (30), తల్లి జయంతి కనకమహాలక్ష్మి (63), పిల్లలు ఈశ్వర్‌చంద్ర,  శ్రీనయన, మేనల్లుడు శరత్‌తో నివాసం ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం–లలితాదేవికి 12 ఏళ్ళ క్రితం పెళ్లయ్యింది. అత్తాకోడళ్లు లలితాదేవి, కనకమహాలక్ష్మికి పెళ్లయిన తొలినాళ్ల నుంచే విభేదాలు తలెత్తాయి. 

ఇద్దరికి రోజూ ఏదో విషయంలో గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అత్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని లలిత నిర్ణయించుకుంది. హత్యచేసి ఎలా తప్పించుకోవాలన్నది తెలుసుకోడానికి యూట్యూబ్‌లో క్రైమ్‌ వీడియోలు చూసింది. తద్వారా ఒక పథకం సిద్ధం చేసుకుంది. ఈ నెల 6న సింహచలం గోశాల వద్ద ఉన్న బంక్‌లో సీసాలో లీటరు పెట్రోలు తీసుకుని ఇంట్లో దాచిపెట్టింది. శుక్రవారం ఉదయం భర్త సుబ్రహ్మణ్యం, మేనల్లుడు శరత్‌ పనిమీద బయటకు వెళ్లారు. 

అత్తను హత్య చేసేందుకు అదే తగిన సమయమని భావించింది. ‘నాన్నమ్మతో దొంగాపోలీస్‌ ఆట ఆడి.. ఆమెను తాళ్లతో కట్టేసి కళ్లకు గంతలు కట్టండి’ అని పిల్లలకు పురమాయించింది. విషయం తెలియని పిల్లలు నాన్నమ్మను అడగ్గా.. కనకమహాలక్ష్మి పిల్లల సరదా కోసం ఒప్పుకుంది. అంతే పిల్లలు తాళ్లతో కట్టేసి, కళ్లకు గంతలు వేయడంతో కనకమహాలక్ష్మిపై అప్పటికే సిద్ధం చేసుకున్న పెట్రోల్‌ను క్షణాల్లో ఆమెపై పోసి, దేవుడి పటాల వద్ద ఉన్న దీపాన్ని ఆమె మీదకు విసిరింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని కనకమహాలక్ష్మి పెద్దగా కేకలు వేయడంలో చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే శరీరం పూర్తిగా కాలిపోయిన కనకమహాలక్ష్మి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. 

కాగా, దీపం జారిపడటంతో మంటలు అంటుకుని తన అత్త ప్రమాదానికి గురైనట్టు ప్రజలతో పాటు పోలీసులను లలిత నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసులు పెట్రోల్‌ వాసన గమనించి తమదైన శైలిలో విచారణ చేయగా నిందితురాలు నేరం ఒప్పుకుంది.  హతురాలి కుమారుడు సుబ్రహ్మణ్యం ఇచి్చన ఫిర్యాదు మేరకు నిందితురాలిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రమాదంలో సుబ్రహ్మణ్యం కుమార్తె శ్రీనయనకు స్వల్ప గాయాలయ్యాయి.    

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)