Breaking News

టీడీపీ నేతల వేధింపులతో దళిత యువతి ఆత్మహత్య!

Published on Wed, 08/28/2024 - 12:03

సాక్షి, నరసరావుపేట/పిడుగురాళ్ల రూరల్‌: టీడీపీ నేతల వేధింపులు తాళలేక ఓ దళిత యువతి మంగ­ళవారం సాగర్‌ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. జూలకల్లుకు చెందిన రాము­డు, కుమారి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. ప్రభుత్వ రేషన్‌ డిపో నడిపే రాముడు గతేడాది అక్టోబర్‌ 6న చనిపోయాడు. అప్పటినుంచి మూడో కుమార్తె మనీషా ఆ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. 

ఎన్నికల్లో మనీషా కుటుంబం వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటు వేసిం­దన్న కక్షతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఆయన అనుచరులైన ఆమె సమీప బంధువులు రేషన్‌ షాపు వదులుకోవాలని బెదిరించి, దాడులకు దిగారు. వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ దగ్గరకు పిలిపించి షాపు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయడంతో ఆమె అంగీకరించక తప్పలేదు. ఆ దుకాణం మనీషా తల్లి పేరిట ఉండటంతో ఆమె చేత వేలి ముద్ర వేయించుకొని గత నెల నుంచి రేషన్‌ను టీడీపీ నాయకులే పంపిణీ చేశారు. అది చాలదన్నట్టు మనీషా కుటుంబం రేషన్‌ వాడుకున్నారని, దానికి డబ్బులు చెల్లించాలని అధికారులు, టీడీపీ నాయకులు హుకుం జారీ చేశారు. 

అంత డబ్బు ఇవ్వలేమని, కొంత కడతామని చెప్పినా వినకుండా వరుసకు అన్న అయ్యే లంజపల్లి వెంకటేశ్వర్లు, ఆయన తండ్రి పిచ్చయ్య మనీషాపై దాడిచేసి, మానసికంగా హింసించారు. అప్పటి నుంచి చనిపోతానంటూ మనీషా ఏడుస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆమె కనిపించకపోవడంతో బంధువులు, గ్రామస్తులు వెతగ్గా సాగర్‌ కెనాల్‌ గట్టుపై చెప్పులు, చున్నీ, ఓ లేఖ కనిపించాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రేషన్‌ షాపు వదులుకోకపోతే ఏం చేస్తారోనన్న భయంతోనే తన బిడ్డ చనిపోయిందని తల్లి కుమారి కన్నీరు మున్నీరవుతోంది.  

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)