Breaking News

తీవ్ర తుపానుగా ‘దానా’

Published on Thu, 10/24/2024 - 05:56

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను తీవ్రరూపం దాల్చింది. ఇది వాయవ్య దిశగా గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వైపు ప్రయా­ణిస్తోంది. గురువారం తెల్ల­వారు­జామున తీవ్ర తుపానుగా మరింత బలపడ­నుంది. ప్రస్తుతం పారాదీప్‌కు ఆగ్నేయంగా 420 కి.మీ., దమరకు 450 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాల్లో పూరీ–సాగర్‌ ద్వీపం మధ్య గురు­వారం అర్ధరాత్రి నుంచి తీరం దాటే ప్రక్రియ ప్రారంభం కానుంది. 

శుక్రవారం ఉదయానికి ఒడిశాలోని బిటర్క నికా–దమర వద్ద తీరం దాటే సూచనలు కనిపి స్తున్నాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీవ్ర తుపానుగా బలపడటంతో తీరం దాటే సమయంలో గంటకు 100–110 కి.మీ. వేగంతో, గరిష్టంగా 120 కి.మీ. వేగంతో ఉధృత గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై తీవ్రంగా ఉంటుందన్నారు. 



అదేవిధంగా గురువారం మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందనీ.. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు వానలు పడతాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ.. మత్స్యకారులెవరూ 25వ తేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)