Breaking News

‘కాస్ట్ లీ కరెంట్’ ఒప్పందం: ‘ప్రజలపై రూ. 15 వేల కోట్లు భారం వేస్తారా?’

Published on Mon, 05/05/2025 - 17:33

విజయవాడ:  యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్తో కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్‌ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధం కావడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం రూ. 2.49 పైసలకే యూనిట్ ను కొనుగోలు చేస్తేనే విషం కక్కిన కూటమి పెద్దలు.. ఇప్పుడు ఏకండా రూ. 4.60 పైసలకు ఎలా ఒప్పందం చేసుకుంటారని ప్రశ్న వినిపిస్తోంది.  ఈ ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది.

దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ..  ‘2018లో తిరస్కరించిన ఒప్పందాన్ని తిరిగి తీసుకుని రావడం దారుణం. రాష్ట్ర ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం మోపి, యాక్సిస్‌ కంపెనీకి కట్టబెట్టడానికి టిడిపి కూటమి ప్రభుత్వం చేయించిన ఈ ఒప్పందం ఎంత మాత్రమూ అనుమతించం. రాష్ట్ర ప్రజలపై పాతికేళ్ళపాటు రూ.15 వేల కోట్లు భారం వేసే ఈ ఒప్పందాన్ని విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ (ఏపిఈఆర్‌సి) ఆమోదముద్ర వేయడం అన్యాయం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో యూనిట్‌ రూ.2 లు, 2.50లకి ఒప్పందాలు జరుగుతున్నాయి.

గతంలో అదానీ సంస్థతో సెకీ ద్వారా సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ రూ.2.49లు ఒప్పందం చేసుకోగా అది అధిక రేటు అని తెలుగుదేశంతో సహా అన్నిపక్షాలు విమర్శించాయి. నేడు దానికంటే రూ.2.10లు అధికంగా చేసే ఒప్పందాలు చేసుకోవడం దారుణం. దీన్ని  వెంటనే రద్దు చేసుకోవాలి’ అని 
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

సంపద సృష్టి అన్న బాబు.. ఇప్పుడు దోచుకుంటున్నారు
‘యాక్సిస్’ తో విద్యుత్ కొనుగోలు  ఒప్పందంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మండిపడింది. సంపద సృష్టిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం. మేం సెకీతో ఒప్పందం చేసుకుంటే గగ్గోలు పెట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 2.49పైసలకు ఒప్పందం చేసుకుంది. దీనిపై విషం కక్కారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ. 4.60 పైసలకు ఒప్పందం చేసుకుంది. ఇవి ఎల్లో మీడియాకు కనబడటం లేదా?, అని ప్రశ్నించారు.

‘యాక్సిస్‌’తో అడ్డగోలు ఒప్పందం.. ప్రజలకు పాతికేళ్ల 'షాక్‌'
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)