Breaking News

భారతీయులను వెనక్కి పంపేస్తున్నాయ్‌..

Published on Sun, 12/28/2025 - 05:44

సాక్షి, అమరావతి: సరైన పత్రాలు లేకుండా విదేశాలకు వెళ్లిన అనేక మంది భారతీయులను పలు దేశాలు తిరిగి వెనక్కి పంపుతున్నాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా 24,600 మంది భారతీయులు ఇలా వెనక్కి వచ్చారు. భారతీయులను వెనక్కి పంపిన దేశాల్లో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. ఒక్క సౌదీ అరేబియానే 11,000 మంది భారతీయులను సరైన పత్రాలు లేకపోవడం, వీసా గడువు తీరినా ఆ దేశంలో ఉండడం, కార్మిక చట్టాలు ఉల్లంఘించడం వంటి కారణాలతో వెనక్కి పంపేసింది. 

ఆ తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. ట్రంప్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను బయ­టకు పంపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది అమెరికా నుంచి 3,800 మంది ఇలా వెనక్కి వచ్చేయగా అందులో ఒక్క వాషింగ్టన్‌ నుంచే 3,414 మంది, హోస్టన్‌ నుంచి 234 మంది ఉన్నట్లు కేంద్ర విదేశాంగమంత్రి తాజాగా రాజ్యసభకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది.  

ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారే అత్యధికం.. 
విదేశాలకు భవన నిర్మాణ పనులు చేయడానికి వెళ్తున్నవారిలో అత్యధికమంది ఏజెంట్ల చేతిలో మోసపోయినవారే. మయన్మార్‌ నుంచి 1,591, మలేíÙయా నుంచి 1,485, యూఏఈ నుంచి 1,469, బహ్రెయిన్‌ నుంచి 769 మంది వెనక్కి వచ్చారు. 

సరైన పత్రాలు లేకుండా ఆయా దేశాల్లోకి అడుగు పెట్టారంటూ వెనక్కి పంపించేశాయి. కేవలం ఉపాధి కోసం వెళ్లిన వారే కాకుండా విద్యా­ర్థులు కూడా మోసపోయిన వారి జాబితాలో ఉన్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారిలో అత్యధికంగా 170 మందిని బ్రిటన్‌ వెనక్కి పంపింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా 114 మందిని, రష్యా 82, అమెరికా 45 మంది విద్యార్థులను వెనక్కి పంపాయి.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)