Breaking News

పత్తి రైతుపై కత్తి!

Published on Fri, 11/21/2025 - 04:53

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు షేక్‌ మాబు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండల కేంద్రం. మూడెకరాలు కౌలుకు తీసుకుని ఖరీఫ్‌లో పత్తి సాగుచేశాడు. కౌలుకు రూ.45 వేలతో పాటు సాగు, ఎరువులు, విత్తనాలు, మందులకు మొత్తం రూ.1.50 లక్షల దాకా పెట్టుబడి పెట్టాడు. మోంథా తుపాను, అంతకుముందు వ చ్చిన అధిక వర్షాలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపగా, ఉన్న అరకొర కాయలో నీరుచేరి పత్తి నాణ్యత లోపించింది. 

కూలీలకు రూ.30 వేల వరకు ఖర్చుచేసి ఇటీవల మొదటి తీత పత్తి తీయగా మూడెకరాలకు 11 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వ చ్చింది. పత్తిని విక్రయించేందుకు సత్తెనపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే నాణ్యతలేదని తిరస్కరించారు. దీంతో.. మాబు ప్రైవేట్‌ దళారులకు క్వింటా కేవలం రూ.5,700కు అమ్ముకున్నాడు. మూడెకరాలకు వ చ్చింది కేవలం రూ.63 వేలే. మిగిలిన 2, 3 తీతలకు కూలీ డబ్బులు కూడా రావని మాబు బుధవారం పొలంలోని పత్తి పంటను దున్నించేశాడు.   

సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు రాష్ట్రంలో రైతుల్ని కుదేలు చేస్తున్నాయి. ఇప్పటికే మామిడి, ఉల్లి, టమోటా, అరటి రైతులు తమ ఉత్పత్తులను రోడ్లపై పారబోసి పంటలను దున్నేయగా తాజాగా ఆ జాబితాలో పత్తి రైతులూ చేరుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన భారీ వర్షాలకు పల్నాడు జిల్లాలో పత్తి పంట బాగా దెబ్బతింది. పత్తి కాయల్లోకి వర్షపునీరు చేరడంతో అవి నల్లగా మారిపోయాయి. 

పత్తి నాణ్య­తతో పాటు దిగుబడిపైనా వర్షాల ప్రభావం ఎక్కువగా పడింది. తుపానుకు ముందు ఎకరాకు 8–10 క్వింటాళ్ల పత్తి ఆశించిన రైతులకు వర్షాలవల్ల 5–6 క్వింటాళ్లు కూడా దిగుబడి రాని దుస్థితి. ఇలా పల్నాడు జిల్లా వ్యాప్తంగా 54,145 ఎకరాల్లో పత్తి పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాలు వేసిన చంద్రబాబు ప్రభుత్వం.. చివరకు 3,912 ఎకరాలు మాత్రమే నష్టపోయినట్లు తుది లెక్కలను కుదించి మిగతా పంట పరిహారాన్ని ఎగ్గొట్టేస్తోంది. నిబంధనల పేరిట నష్టపోయిన రైతులను జాబితా నుంచి తొలగించింది.  

విసుగు చెంది దున్నేస్తున్న రైతులు 
ఇలా ప్రకృతి ప్రకోపాలు, చంద్రబాబు సర్కారు దగాతో నష్టపోయి మిగిలిన అరకొర పంటనైనా అమ్ముకుందామని చూసిన పత్తి రైతును సీసీఐ నిబంధనలు కూడా చిత్తుచేస్తున్నాయి. నిజానికి.. పత్తి తేమ శాతం 8 నుంచి 12 శాతం మధ్య ఉండాలి, ఎనిమిది శాతం ఉంటే పూర్తిస్థాయిలో మద్దతు ధర రూ.8,110 దక్కగా, తేమ శాతం పెరిగితే రూ.7,710 దాకా ఇస్తున్నారు. 12 శాతం దాటితే తిరస్కరిస్తున్నారు. 

అయితే, తుపాను ప్రభావం, మారిన వాతావరణ పరిస్థితులవల్ల పత్తిలో తేమ శాతం 18 నుంచి 22 వరకు ఉంటోంది. దీంతో.. బయ్యర్లు కొనుగోలు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. సీసీఐ కేంద్రాలకు పత్తిని తీసుకొ చ్చి, వెనక్కి తీసుకెళ్లడంతో రవాణా, కూలీల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రైవేట్‌ దళారులు క్వింటా పత్తి రూ.5 వేలకే కొనుగోలు చేస్తున్నారు. 

ఆ డబ్బులు కూలీలు, రవాణా ఖర్చులకు కూడా మిగలకపోవడంతో రైతులు విసుగుచెంది పత్తిపంటను దున్నేస్తున్నారు. నష్టపోయిన రైతుల్లో అత్యధికంగా కౌలు రైతులున్నారు. వీరికి నష్టపరిహారం, అన్నదాత 
సుఖీభవ వంటి సదుపాయాలేవీ చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడంలేదు.

రూ.లక్షకు పైగా నష్టపోయా.. 
మూడెకరాల్లో పత్తి పంట సాగుచేయగా ఇప్పటికి ఏడు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వ చ్చింది. మిగిలిన తీతలలో పెద్దగా వచ్చేలా లేదు. అధిక వర్షాలకు నీరు ఎక్కువ రోజులు నిలిచి మొక్కలు ఎండిపోయాయి. చేసేదిలేక పంటను దున్నేశా. ఎకరాకు రూ.35 వేల చొప్పున రూ.లక్షకు పైగా నష్టపోయా. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే సాగు కష్టం.  – గోగులపాటి కన్నయ్య, పత్తి రైతు, పెదకూరపాడు 

తుపాను పరిహారం అందలేదు
ఈ ఏడాది ఎకరాన్నర భూ­మిని కౌలుకు తీసు­కొని పత్తి సాగుచేశా. అధి­క వర్షాలకు తెగులు, కాయలకు పుచ్చు ఎక్కువగా వచ్చి దిగుబడి పడిపోయింది. కేవలం ఒకటిన్నర క్వింటా పత్తి మాత్రమే వచ్చింది, దాన్ని అమ్మడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. పంటను తీయ­డానికి మళ్లీ అప్పులుచేయాల్సి వస్తుండడంతో ట్రాక్టర్‌తో పంటను దున్నేశా. తుపాను పరిహారం కూడా అందలేదు. ప్రభు­త్వం సాయం చేయక­పోతే కౌలు రైతులు సాగుచేసే పరిస్థితి ఉండదు. – దొడ్డా బాబురావు, పత్తి రైతు, పెదకూరపాడు

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)