టీఏఎల్‌ క్రికెట్‌ లీగ్‌ విజేతగా కూల్‌ క్రూయిర్స్‌

Published on Wed, 08/09/2023 - 04:48

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ చైర్మన్‌ కందుకూరి భారతి సాక్షి, అమరావతి: ‘ప్రైమ్‌ నార్త్‌’ తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (టీఏఎల్‌) క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కూల్‌ క్రూయిర్స్‌ జట్టు విజేతగా నిలిచినట్టు టీఏఎల్‌ చైర్మన్‌ కందుకూరి భారతి తెలిపారు. ఆదివారం ఇంగ్లాండ్‌లోని లాంగ్లీ స్లౌ క్రికెట్‌ క్లబ్‌ మైదానంలో ఫైనల్స్‌ నిర్వహించామన్నారు. ద్వితీయ స్థానంలో డీజే వారియర్స్‌, తృతీయ స్థానంలో వైజాగ్‌ బ్లూస్‌ జట్లు గెలుపొందాయని తెలిపారు.

ఈ ఏడాది 10 జట్లతో 14 వారాల పాటు 51 మ్యాచ్‌లతో లీగ్‌ విజయవంతంగా ముగిసిందన్నారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌, ఉత్తమ బౌలర్‌గా వైజాగ్ బ్లూస్‌కు చెందిన శ్రీధర్(21 వికెట్లు), ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా డీజే వారియర్స్‌కు చెందిన పవన్‌కుమార్‌ (274 పరుగులు)నిలిచారన్నారు. తొలిసారిగా మహిళా క్రికెట్‌ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఐటీ ట్రీ వారియర్స్‌, గెలాక్సీ గర్ల్స్‌ మధ్య పోటీలో గెలాక్సీ గర్ల్స్‌ గెలుపొందినట్టు పేర్కొన్నారు.

2008లో లండన్‌లో టీఏఎల్‌ క్రికెట్ లీగ్‌ని ప్రారంభించిందని, 2012లో ప్రీమియర్‌ లీగ్‌ ఫార్మాట్‌గా రూపాంతరం చెందిందన్నారు. యూకేలోని అన్ని తెలుగు కుటుంబాలను కలుపుతూ పెద్ద కమ్యూనిటీ క్రికెట్‌ లీగ్‌ అవతరించినట్టు తెలిపారు. టోర్నీ విజయవంతానికి కృషి చేసిన అనితా నోముల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, గిరిధర్, అనిల్, కిషోర్లను అభినందించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)