Breaking News

కరకట్ట ప్యాలెస్‌ కిరాతకమే

Published on Wed, 02/04/2026 - 05:33

సాక్షి, టాస్క్ ఫోర్స్‌: కరకట్ట ప్యాలెస్‌ కేంద్రంగానే వైఎస్సార్‌ సీపీ నేత జోగి రమేశ్‌ ఇంటిపై దాడికి వ్యూహ రచన జరిగినట్లు స్పష్టమైంది. పెదబాబు, చినబాబు ఆదేశాల మేరకే ఓ పార్లమెంట్‌ నియోజకవర్గం ముఖ్య నేత ఈ ధ్వంస రచన చేశారని విశ్వసనీయ సమాచారం. శనివారం గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరగ్గానే.. అదే రోజు రాత్రి పొద్దుపోయాక టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్య నేతకు చినబాబు కాల్‌ చేసినట్లు సమాచారం. 

ఆ మరుసటి రోజే.. అంటే ఆదివారం జోగి రమేశ్‌ ఇంటిపై దాడి చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. దీంతో ఆ పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్యనేత.. విజయవాడ పశి్చమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ  మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఫతావుల్లాతోపాటు, మైనార్టీ మహిళా నేత ఆషా, గొల్లపూడికి చెందిన టీడీపీ నేతలు, విజయవాడ, మైలవరం నియోజకవర్గానికి చెందిన నేతలకు ఈ దాడి బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. 

దాడిలో కీలకంగా పాల్లొన్న షేక్‌ ఆషా, ఫతావుల్లాలిద్దరూ చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రి అనితకు బాగా తెలుసని.. దాడులు చేయడానికి రౌడీ మూకలను కూడగట్టడంలో వారిది అందెవేసిన చేయి అని సమాచారం. ముఖ్య నేతల ఆదేశాలు కావడంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెట్రో బాంబులు విసిరే వారిని ఆగమేఘాలపై రప్పించి.. దాడికి పురిగొలిపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు టీడీపీ కార్యకర్తలే బహిరంగంగా వెల్లడిస్తుండడం గమనార్హం. 

‘అధికారంలో ఉన్నది మేమే.. మళ్లీ ఎన్నికలొచి్చనా గెలిచేది మేమే.. ఎలా గెలవాలో పెదబాబు, చినబాబుకు తెలుసు. అందువల్ల మాకేం భయం లేదు. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.  ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోక పోతే ఆయనకు పట్టిన గతే పడుతుంది’ అని ఆషా, ఫతావుల్లాలతోపాటు, గొల్లపూడి, మైలవరానికి చెందిన నేతలు రౌడీలను సిద్ధం చేసి దాడికి పురమాయించారు. ఈ ఇద్దరు నేతలకు ఇదివరకే ‘మీకు మంచి భవిష్యత్‌ ఉంటుంది. పార్టీ సూచనల మేరకు నడుచుకోండి’ అని చినబాబు  దిశానిర్దేశం చేశారని.. అందువల్లే వారు, పార్టీనేతలతో కలిసి, రెచి్చపోయి ధ్వంసరచన చేసినట్లు తెలిసింది.  

పోలీసులకు ముందే తెలిసినా.. 
మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఇంటిపై దాడి జరుగుతుందని ముందస్తు సమాచారం ఉన్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినట్లు స్పష్టం అవుతోంది. దాడికి వెళ్తున్న పచ్చ మూకలకు రక్షణగా పోలీసులు వెళ్లినట్లు  ఘటనా స్థలంలో పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. ఈ దాడుల స్కెచ్‌లో ఓ పోలీసు అధికారి కీలక భూమిక పోషించినట్లు తెలుస్తోంది. దాడులు జరుగుతున్న సమయంలో సమీప సెంటర్‌లో టీడీపీ నేతలతో కలిసి ఉండి , ప్రోత్సహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన విమర్శల్లో నిజం లేదని సీబీఐ సిట్‌ చార్జిషీట్‌ తేల్చడంతో డైవర్షన్‌ పాలిటిక్స్‌ల్లో భాగంగానే మాజీ మంత్రుల ఇళ్లపై దాడులకు టీడీపీ ముఖ్యనేతలు కుట్ర పన్నినట్టు స్పష్టమవుతోంది. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరుగుతున్న సమయంలో స్పందించని పోలీసులు, ప్రభుత్వం దాడుల తంతంగమం ముగిశాక తాపీగా సీఎం చంద్రబాబు నాయుడు తాను ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులను  సహించబోనని, శాంతి భద్రతల విషయంలో రాజీపడబోనని నీతి వచనాలు వల్లెవేస్తూ సన్నాయి నొక్కులు నొక్కడంపై సర్వతా ఆగ్రహం వ్యక్తమవుతోంది.   

పరామర్శకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు  
దాడులకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులుదాడులు జరిగిన తర్వాత మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఇంటికి పరామర్శకు వెళ్తున్న ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ జగన్మోహనరావును అడ్డుకొని, అన్యాయంగా అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసి విజయవాడలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలానే బాధితుడైన మాజీ మంత్రి జోగి రమేష్ పైనా అన్యాయంగా అక్రమ కేసులు నమోదు చేయడం గమనార్హం. టీడీపీ మూకల దాడులపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నామమాత్రం కేసులతో చేతులు దులుపుకున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)