Breaking News

గుడివాడ సిద్ధం సభలో సీఎం జగన్‌పై మరో దాడికి కుట్ర

Published on Wed, 04/17/2024 - 04:46

కంకిపాడు: కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మరో దాడికి కుట్ర జరిగింది. విజయవాడలో శనివారం సీఎంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గుడివాడలో సోమవారం మరోసారి దాడిచేసి, అల్లర్లు సృష్టించటమే లక్ష్యంగా టీడీపీ సానుభూతిపరుడు కుట్రపన్నాడు. మద్యం తాగి రాయితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించేయత్నం చేసిన యువకుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవటంతో కుట్రభగ్నమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కుట్రపై అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపట్టారు.

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన కోటా శరత్‌ అలియాస్‌ రాఘవులు మద్యం తాగి రాయితో సభా ప్రాంగణానికి ప్రవేశించే యత్నం చేశాడు. పోలీసులు శరత్‌ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద రాయిని స్వా«దీనం చేసుకున్నారు. అతడు టీడీపీ సానుభూతిపరుడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గుడివాడ పట్టణ పోలీసులు మంగళవారం మంతెన గ్రామంలో విచారించారు. శరత్‌తో పాటు మరో ముగ్గురు టీడీపీ సానుభూతిపరులు కూడా సిద్ధం సభకు వచి్చనట్లు పోలీసులు భావిస్తున్నారు. సభలో కల్లోలం సృష్టించటం లక్ష్యంగా జరిగిన కుట్ర వెనుక వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు అన్ని కోణాల్లోను విచారిస్తున్నారు.  

అన్ని కోణాల్లో దర్యాప్తు  
గుడివాడలో జరిగిన సిద్ధం సభకు యువకుడు రాయితో ప్రవేశించబోతే సిబ్బంది తనిఖీల్లో పట్టుబడిన మాట వాస్తవమే. సభలో అల్లర్లు, దాడి చేసేందుకు రాయితో వచ్చాడా? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? కారణం ఏంటి? అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తాం.  – అద్నాన్‌ నయీమ్‌ అస్మి, కృష్ణాజిల్లా ఎస్పీ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)