Breaking News

కార్మికులపై సవరణ కత్తి

Published on Wed, 06/11/2025 - 01:59

సాక్షి, అమరావతి: శ్రమ దోపిడీకి ఆస్కారం ఇస్తూ కార్మికుల హక్కులను కాలరాసేందుకు కూటమి సర్కారు కుట్రపన్నుతోంది. ఇప్పటికే పని వేళలను పది గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న కర్కశ ప్రభుత్వం ఇప్పుడు చిన్న సంస్థల్లో పనిచేసే చిరుజీవుల నోట్లో మట్టి కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. 

చిన్న వాణిజ్య సంస్థల్లో పనిచేసే గుమాస్తాలు, వాచ్‌మెన్‌లు, ఇతర చిరుద్యోగుల హక్కులు కాపాడే ఏపీ షాప్స్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ చట్టాన్ని సవరించేందుకు సిద్ధమైంది. 20 మందిలోపు సిబ్బంది ఉండే సంస్థలపై కార్మిక శాఖ జోక్యం లేకుండా చట్ట సవరణకు ప్రతిపాదనలు చేసింది. ఇవి వచ్చే కేబినెట్‌ భేటీలో మంత్రివర్గం ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

యజమానే డిక్లరేషన్‌ ఇస్తే చాలట
రాష్ట్రంలో ఒకటి నుంచి 20 మంది సిబ్బందితో కార్య­క­లా­పాలు నిర్వహించే సంస్థలు 3.50 లక్షలకుపైగా ఉన్నాయి. వీటిల్లో 30 లక్షల మంది కార్మికులు, చిరుద్యోగులు పనిచేస్తుంటారు. ఈ సంస్థలు ఏపీ షాప్స్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం–1988 మార్గ­దర్శకాలు పాటించాలి. ఈ చట్టం ప్రకారం.. ఎప్పటికప్పుడు కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేప­ట్టి నిబంధనలు ఉల్లంఘించిన యజమా­నులపై కేసుల నమోదుకు అవకాశం ఉంటుంది. 

అయితే 20 మంది లోపు సిబ్బందితో నడిచే సంస్థలను కార్మిక శాఖ పరిధి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం చర్య­లు చేపడుతోంది. దీనిప్రకారం.. అన్ని నిబంధన­లూ సక్రమంగా పాటిస్తున్నామని యజమాని సెల్ఫ్‌ డిక్ల­రేషన్‌ ఇస్తే చాలు.. ఆ సంస్థలలో కార్మిక శాఖ అధి­కారులు తనిఖీలు చేయడానికి అవకాశం ఉండదు.   

దాదాపు 12 గంటలు పనిచేయిస్తున్న సంస్థలు 
ఇప్పటికే చిన్న సంస్థల యజమానులు శ్రామికుల చేత 12 గంటలకుపైగా పనిచేయిస్తున్నారు. ఉద­యం పది గంటలకు దుకాణానికి వెళితే రాత్రి పది­గంటల తర్వాత కూడా వెట్టిచాకిరీ చేయిస్తు­న్నారు. కార్మిక శాఖ ఏడాది పొడవునా ఈ దుకా­ణా­లను తనిఖీ చేసి నియంత్రిస్తున్నా.. యజమానులు లెక్కచేయని దుస్థితి. ఇప్పుడు ప్రభుత్వమే కార్మిక శాఖ పరిధి నుంచి వాటిని మినహాయిస్తే ఇప్పుడు పరిస్థితి ఇంకా ఎంత భయానకంగా ఉంటుందోనని శ్రామికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు.  

ఇప్పటికే పని గంటలు పెంపు
ఓ వైపు పని వేళలు తగ్గించాలని కార్మిక వర్గాల నుంచి డిమాండ్‌ వ్యక్తమవుతుంటే దీనికి భిన్నంగా పెట్టుబడుల ఆకర్షణను సాకుగా చూపి పని వేళలను గరిష్టంగా 9 నుంచి 10 గంటలకు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణ­యం తీసుకుంది. దీనిపై ఇప్పటికే కార్మికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

ప్రభుత్వం తీసు­కున్న నిర్ణయంతో త్రైమాసిక కాలానికి ఓవర్‌ టైమ్‌ 75 గంటల నుంచి 144 గంటలకు పెరి­గాయి. ఈ పెంపు వల్ల ఎక్కువ సంపాదించవ­చ్చని సర్కారు వక్రభాష్యం చెబుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కనీస వేతనాలే అమలు కావడం లేదన్న సత్యాన్ని ఉద్దేశపూర్వంగా విస్మరిస్తోంది.    

ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌ యాక్ట్‌– 1988 చట్టం ఏం చెబుతోందంటే..
» ఒక వర్కర్‌ను సంస్థలో చేర్చుకునేప్పుడు నియామక పత్రం ఇవ్వాలి.
»  ఉద్యోగి అటెండెన్స్‌ రిజిçష్ట్టర్‌ను నిర్వహించాలి. ప్రతినెలా ఐదో తేదీలోపు వేతనం చెల్లించాలి.
»  ఏటా 12 రోజులు క్యాజువల్‌ లీవ్స్, 9 పండుగ సెలవులు ఇవ్వాలి.  వీక్లీ ఆఫ్‌ అమలు చేయాలి. 
» వర్కర్‌కు మధ్యలో డబ్బు అవసరం అయితే ఇవ్వడానికి వీలుగా అడ్వాన్స్‌ రిజిస్టర్‌ పెట్టాలి.
» ఉద్యోగంలో నుంచి తీసి వేయడానికి నెల ముందు నోటీస్‌ ఇవ్వాలి.
» 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్టయితే నెల వేతనం ఏటా బోనస్‌ కింద ఇవ్వాలి. కనీస వేతనాల చట్టం అమలు, స్త్రీ, పురుషులకు సమాన వేతనం పాటించాలి. 
» కార్మిక శాఖ సాధారణ తనిఖీల్లో నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తిస్తే కేసు నమోదు చేసి, కోర్టులో చార్జి షీట్‌ దాఖలు చేయడానికి వీలుంటుంది.  కనీస వేతనాలు ఇవ్వలేదని తేలితే యజమాని నుంచి రికవరీ చేయచ్చు.
చట్ట సవరణ చేస్తే.. 
» చట్ట సవరణ అయితే ఎవరైనా శ్రామికుడు ఫిర్యాదు చేస్తే తప్ప కార్మిక శాఖ చిన్న సంస్థలపై జోక్యం చేసుకోరాదు. దీనివల్ల  ఇప్పుడు ఉన్న హక్కులన్నింటినీ కార్మికుడు కోల్పోయే ప్రమాదం ఉంది. యజమాని సెల్ఫ్‌ డిక్లరేషన్‌లో అసత్యాలు పేర్కొనే ఆస్కారమూ ఉంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)