Breaking News

లక్ష్మీనాయుడు హత్యలో మొదటి ముద్దాయి పవన్‌కళ్యాణే

Published on Mon, 10/20/2025 - 03:40

కందుకూరు/పెదకాకాని/గుంటూరు మెడికల్‌ : కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసులో మొదటి ముద్దాయి ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ అవుతారని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నికలకు ముందు కాపులను టీడీపీకి ఓట్లు వేసేలా ప్రోత్సహించి.. చివరికి టీడీపీ అధికారంలోకి రాగానే అదే కాపులను ఘోరంగా చంపుతుంటే కనీసం ప్రశి్నంచలేని స్థితిలో పవన్‌కళ్యాణ్‌ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కేసులో నిందితులకు కొమ్ముకాస్తూ కేసును నీరుగార్చేలా ఆదేశాలిస్తున్న సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లను ఏ2, ఏ3లుగా చేర్చాలని డిమాండ్‌ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూ­రు మండలం దారకానిపాడులో ఇటీవల దారుణ హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని జక్కంపూడి రాజా, వంగవీటి నరేంద్రలు వేర్వేరుగా పరామర్శించారు. అలాగే, ఇదే ఘటనలో తీవ్రగాయాలపాలైన లక్ష్మీనాయుడు తమ్ముడు పవన్‌నాయుడు, బాబా­యి కుమారుడు భార్గవ్‌నాయుడులను గుంటూరు ఉదయ్‌ ఆస్పత్రిలో జక్కంపూడితో పాటు, అంబటి రాంబాబు పరామర్శించారు. 

ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మీడియాతో మాట్లా­డుతూ టీడీపీ ప్రభు­త్వం ఎప్పుడు అధికారంలోకి వచి్చనా కాపులను హత్యచేయడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తా­రు. వంగవీటి రంగా హత్యతో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబంపై ఎలాంటి భాషను ఉపయోగించి ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసన్నారు. తా­జాగా ఈ నెల 2న తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య జరిగితే ప్రభుత్వం స్పందించడం లేదని.. పవన్‌కళ్యాణ్‌కు బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా లేదా.. అని ప్రశ్నించారు. 

ఏం చేసినా పైనుంచి కాపాడే ఓ అధికార వ్యవస్థ ఉందన్న ధైర్యంతోనే హరిచంద్రప్రసాద్‌ లాంటి మృగాలు రెచి్చపోతున్నాయన్నారు.  హత్యకేసులో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులపై కేసు నమోదు చేయకపోవడం దారుణమని, కూటమి పెద్దల అండదండలతో వారిని తప్పించేందుకు కుట్ర జరుగుతోందన్నారు.   నిందితులకు శిక్ష పడేవరకు బాధితుల తరఫున పోరాడతామని వారు స్పష్టం చేశారు. 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?