Breaking News

మార్గదర్శిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

Published on Fri, 08/25/2023 - 03:51

సామర్లకోట: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థలో చిట్టీ పాడుకొన్నప్పటికీ, సొమ్ము ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేశారు. సామర్లకోట సీఐ కె.దుర్గాప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రం కాకినాడలోని డెయిరీ ఫార్మ్‌ సెంటర్‌ రాజీవ్‌ గృహకల్పకు చెందిన పెంకె మోజెస్‌ 2020 మార్చిలో మార్గదర్శి ఏజెంట్‌ ద్వారా సామర్లకోట బ్రాంచిలో రూ.లక్ష విలువ కలిగిన రెండు చిట్స్‌ తీసుకొన్నారు.

ఒక్కో చిట్‌కు నెలకు రూ.2,500 చెల్లిస్తున్నారు. నాలుగు నెలల తరువాత  ఒక చిట్‌ను రూ.20 వేలకు పాడుకున్నారు. ఆయనకు రావలసిన రూ.80 వేలకు సంబంధించి మార్గదర్శి బ్రాంచి మేనేజరును సంప్రదించగా ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు, ఒక ప్రభుత్వ ఉద్యోగి స్యూరిటీ కావాలని చెప్పారు.

ఇద్దరు ప్రైవేటు  ఉద్యోగుల స్యూరిటీ ఇవ్వగా, ప్రభుత్వ ఉద్యోగి స్యూరిటీ ఇవ్వలేకపోయారు. దాంతో రూ.80 వేలు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని మోజెస్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిసార్లు సంప్రదించినా న్యాయం జరగకపోవడంతో మోజెస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనిచ్చిన ఫిర్యాదుపై సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)