Breaking News

జనసేన కార్యకర్తపై భార్య ఫిర్యాదు

Published on Wed, 07/15/2026 - 08:50

ఏలూరు: కైకలూరులో రాజ్యాంగేతర శక్తిగా మారిన జనసేన కార్యకర్త కొల్లి వీర వెంకట సత్య వరప్రసాద్‌ (బాబీ) నిజస్వరూపాన్ని అతని భార్య దుర్గాదేవీ మీడియా ముందు మంగళవారం బట్టబయలు చేసింది. ఇటీవల కైకలూరు దానిగూడెం దళితుల దాడి కేసులో జైలు జీవితం అనుభవించి వచ్చిన కొల్లి బాబీ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న ఇతనిపై మట్టిదందా, పేకాట నిర్వాహణ వంటి పలు ఆరోపణలు ఉన్నాయి. 

కైకలూరు టౌన్‌ స్టేషన్‌లో బాబీపై అతని భార్య వరకట్న వేధింపులు, అక్రమ సంబంధం, పిల్లలను కలవనివ్వడం లేదంటూ వంటి వాటిపై తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది. కొల్లి బాబీకి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన దుర్గాదేవీతో వివాహ సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చారు. మరింత కట్నం కోసం వేధిస్తుంటే అదనంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. కొల్లి బాబీ వ్యసనాలకు బానిసై తనను మానసికంగా వేధించాడని ఆమె పేర్కొంది. తన పుస్తెలు, పదో తరగతి సర్టిఫికెట్లపై లోను తీసుకుని కార్లలో తిరుగుతూ తనను మనిషిగా చూసేవాడు కాదని వాపోయింది. తనను 5 సంవత్సరాలుగా దూరం పెట్టి ఇంటికి పంపారన్నారు. 

తన బిడ్డలను సెలవులకు తీసుకొచ్చి ఏలూరు సిద్దార్థ హాస్టల్‌లో పెట్టారని వారిని చూడనివ్వకుండా చేస్తున్నారని వాపోయింది. తన భర్తతో ప్రాణభయం ఉందని, అతనికి వివాహేతర సంబంధం ఉందని ఆమె తెలిపింది. ఇంటికి వస్తే నరికేస్తా అంటూ బెదిరిస్తున్నాడని, తన భర్తతో పాటు, నా బిడ్డలతో కలసి జీవించే విధంగా న్యాయం చేయాలని కోరింది. ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదన్నారు. దుర్గాదేవి ఫిర్యాదుపై టౌన్‌ సీఐ ఏవీఎస్‌ రామకృష్ణను వివరణగా కోరగా ఫిర్యాదు అందిందని, ఇద్దరికీ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)