Breaking News

మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

Published on Thu, 05/04/2023 - 17:12

సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): నగరంలోని తిలక్ రోడ్డు షిరిడీ సాయి మార్గ్ జంక్షన్‌లో నిర్మాణ దశలో ఉన్న డ్రెయినేజీలో గత వారం రోజుల కిందట దురదృష్టవశాత్తు కాలు జారి పడి మృతిచెందిన ఏరుకొండ నాగేశ్వరరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు.

మృతుడు నాగేశ్వరరావు కుటుంబానికి నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ.10 లక్షలు‌ ఆర్థిక సహాయాన్ని ఎంపీ భరత్ గురువారం అందజేశారు. అలాగే డ్రెయినేజీ కాంట్రాక్టర్ తరపున మరో రూ.5 లక్షలు నష్టపరిహారాన్ని ఎంపీ భరత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి సహాయ సహకారాలను బహిర్గతం చేయకూడదని, కానీ ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు కొంతమంది శవ రాజకీయాలు చేయడం వల్ల చెప్పక తప్పడం లేదన్నారు.
చదవండి: చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స

జరిగిన సంఘటన దురదృష్టకరం.. మానవతా దృక్పథంతో ఆదుకోవాలి.. తప్పిస్తే ఇటువంటి విషాదకర సంఘటనలను తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం మంచిది కాదన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జరిగిన ఈ సంఘటనను సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని.. ఆయన చాలా బాధపడ్డారన్నారు. మృతుని ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఎంపీ వెంట నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, బొమ్మన జయ్ కుమార్, కొత్త బలమురళి, కంతారం పాటిల్,సీరపు నగేష్ చంద్రరెడ్డి, దుంగ సురేష్, తదితరులు ఉన్నారు.
చదవండి: హోంశాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)