Breaking News

కదంతొక్కిన కోకో రైతులు

Published on Tue, 04/29/2025 - 04:36

కొరిటెపాడు(గుంటూరు): కూటమి ప్రభుత్వ తీరుపై కడుపు మండిన కోకో రైతులు సోమవారం కదం తొక్కారు. వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ధరల ఒప్పంద ప్రకటన చేయకపోవడంపై ఆగ్రహించిన రైతులు గుంటూరులోని ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనరేట్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యా­యం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ నినాదాలు చేశా­రు. ఆంధ్రప్రదేశ్‌ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ మాట్లాడుతూ.. కోకో గింజలు కొనే కంపెనీలు రోజురోజుకూ ధరలు తగ్గిస్తుండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. 

ఈ నెల 3న జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఈనెల 7న కోకో గింజల ధరల ఒప్పంద ప్రకటన వస్తుందని ఎదురు చూశామన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఒప్పంద ప్రకటన చేయలేదని మండిపడ్డారు. మోండలీజ్‌ కంపెనీ ప్రతినిధులు కిలో కోకో గింజలను రూ.550కు కొనుగోలు చేస్తామని మంత్రి సమక్షంలో చెప్పి.. అమలు చేయలేదన్నారు. పైగా మరో రూ.50 ధర తగ్గించారని మండిపాడ్డారు.

 అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో కోకో గింజల ధర రూ.750కు పైగా ఉందని.. రాష్ట్ర రైతులకు కూడా ఆ మేరకు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. వారం, పది రోజుల్లో మళ్లీ కంపెనీలతో సమావేశం నిర్వహించి.. ధరలు తగ్గకుండా చర్యలు తీసుకుంటామని రైతులకు ఉద్యాన శాఖ రాష్ట్ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ కోకో రైతుల సంఘం నాయకులు వై.కేశవరావు, కె.శ్రీనివాస్, ఎస్‌.గోపాల­కృష్ణ, పానుగంటి అచ్యుతరామయ్య పాల్గొన్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)